మా గురించి

మా గురించి

​ యానిమల్ ఎథిక్స్ ఔట్ రీచ్ , రీసెర్చ్ మరియు ఎడ్యుకేషన్ ద్వారా జంతువుల పట్ల గౌరవాన్ని ప్రో త్సహిస్తుంది మేము టీకాలు వేయడం మరియు ప్రకృతి వైపరీత్యాలలో జంతువులకు సహాయం చేయడం వంటి అడవిలోని జంతువుల జీవితాలను మెరుగుపరచడానికి పాటుపడే వారికి మద్దతునిస్తా ము మరియు పరిశోధనలు చేస్తా ము విపత్తు ప్రమాదాలను నివారించడానికి భవిష్యత్తు లో సాంకేతికతలు ఎలా సహాయపడతాయో మరియు అడవి జంతువులకు పెద్ద ఎత్తు న సహాయం చేయడానికి సాంకేతికతను ఉపయోగించే మార్గా లను మేము విశ్లే షి స్తా ము.

మన దృష్టి అనేది అన్ని జీవులకు నైతిక పరిశీలన ఇవ్వబడే ప్రపంచం.

ఇప్పటి వరకు మేము చేసిన పనులు యొక్క సారాంశాలను మీరు క్రింద చూడవచ్చు :

మేము జంతువుల జీవితాల గురించి మరియు వాటిని రక్షించడానికి వాదనల గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తా ము అదనంగా , మేము జంతువులకు హాని కలిగించే నిర్దిష్ట మార్గా లను ( ఇతర సంస్థలు ఇప్పటికే పరిష్కరిస్తు న్నవి ) ఆపడానికి కాకుండా , జాతుల పట్ల వైఖరిలో మార్పును సాధించే లక్ష్యంతో నగరాలలో , వీధులలో ఔట్రీచ్ లను నిర్వహిస్తా ము.

మా పని రోజువారీ జీవితంలో జంతువులను ఎలా పరిగణిస్తా రు , అలాగే జంతువులకు సంబంధించిన మానవ వైఖరులు మరియు కార్యకలాపాలను ప్రభావితం చేసే రంగాలలో వాటిని ఎలా పరిగణిస్తా రు వీటిలో విద్యా సంస్థలు , శాస్త్రీ య రంగాలు మరియు చట్ట వ్యవస్థ ఉన్నాయి ప్రస్తు త మానవ కార్యకలాపాల ద్వార జంతువులు ఎలా ప్రభావితమవుతాయో మరియు భవిష్యత్తు లో ప్రణాళికాబద్ధమైన లేదా ప్రణాళిక లేని మానవ కార్యకలాపాల ద్వారా అవి ఎలా ప్రభావితం కావచ్చో మేము పరిశీలిస్తా ము ఇందులో మనం జంతువులకు హాని కలిగించే మార్గా లను మాత్రమే కాకుండా , జంతువుల ఇబ్బందులకు కారణం మానవ చర్య కానప్పుడు కూడా మనం జంతువులకి ఎలా సహాయం చేయవచ్చనే అంశాలపై ప్రజలకి అవగాహన కల్పిస్తా ము.

యానిమల్ ఎథిక్స్ అనేది మన నైతిక నిర్ణయాలలో జంతువులను ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి మరియు మనం తీసుకోవాల్సిన మార్గా లను విశ్లే షస్తుంది , ఆచరణాత్మక విధానాలను కలిగి ఉంది చాలా మందికి ప్రస్తు తం జంతువుల పట్ల పెద్దగా గౌరవం ఉండదు కానీ జంతువులతో ఉండే అవసరాలని , లాభాలని మాత్రం ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు కానీ ఇప్పటికీ జంతువుల పట్ల వివక్షత వైఖరిని కలిగి ఉంటారు మనం కొన్ని సమయాల్లో జంతువులకు నైతిక మద్దతు ఇవ్వచ్చు కానీ మరికొన్ని సమయాల్లో మనమే జంతువులపై వివక్ష చూపించవచ్చు ఉదాహరణకు ఒక కుక్కకు దారిలో కనబడినప్పుడు మనం బిస్కట్లు వేస్తాం అదే కుక్క మన గుమ్మంలో కూర్చుంటే చీ అని పొమ్మంటాం మేక పిల్ల ముద్దగా ఉందని దానితో ఆడుకుంటాం , మళ్ళీ మేకనే మనం తింటాం ఇలా నైతికంగా మనం వ్యహరిస్తూ కూడా కొన్ని సమయాల్లో వివక్ష చూపిస్తాం ఇలా కాకుండా ఎప్పుడూ జంతువల పట్ల నైతికంగా వ్యవహరించేలా యానిమల్ ఎథిక్స్ అవగాహన కల్పిస్తుంది జంతువుల పట్ల మనుషుల వ్యవహారంలో చైతన్యం కలిగించాడానికి ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుంది.