భావాలను గుర్తించడానికి గల ప్రమాణాలు
Sheep family sleeps together in the grass

భావాలను గుర్తించడానికి గల ప్రమాణాలు

ఒక జీవికి భావాలు ఉన్నాయా అని నిర్ణయించడానికి మూడు సాధారణ ప్రమాణాలు వున్నాయి. వీటిలో పరిగణలోకి తీసుకోబడే అంశాలు (1) ప్రవర్తన (2) పరిణామం (3) శారీరకం.

ప్రవర్తన

మనం బాధ లేదా ఆనందాన్ని అనుభవించినప్పుడు మనం కొన్ని విధాలుగా ప్రవర్తిస్తాం. మనం ఆందోళన పడతాం, ఏడుస్తాం, మూలుగుతాం…. భావాలు కలిగిన ఇతర జీవులలో కూడా ఇదే జరుగుతుంది. మానవులకు మరియు పెద్ద సంఖ్యలో గల మానవేతర జంతువులకు ఇది వర్తిస్తుంది. ఇలా ప్రవర్తించేవాళ్ళు అనుకూల లేక ప్రతికూల అనుభవాలను పొందుతున్నారని ఈ రకమైన ప్రవర్తన సూచిస్తుంది.1

కొన్ని సార్లు పర్యావరణానికి మేలు లేదా హాని కలిగించేలా వుండే వాటి ప్రవర్తన వల్ల వాటికి ఎటువంటి అనుభవాలు కలిగాయో మనం ఊహించవచ్చు. ఉదాహరణకి ఒక జంతువు మొదటిసారి మంటల వల్ల గాయపడ్డాక, భవిష్యత్తులో అది మంటలకు దూరంగా వుంటుంది. మంచి అనుభవాలకు కూడా ఇది వర్తిస్తుంది, ఉదాహరణకి ఒక చోట ఆహారాన్ని పొందిన జంతువు తిరిగి అదే ప్రదేశానికి వస్తుంది. ఏదేమైనా, జీవులు బాధ మరియు ఆనందాన్ని అనుభవిస్తున్నాయి అని నమ్మడానికి ఈ ప్రవర్తన మాత్రమే సరిపోదు. ఇది సాధారణంగా, జంతువులు చాలా అనుభవాలు పొందుతున్నాయి మరియు అవి స్పృహ లో వున్నాయి అని నమ్మడానికి ఒక కారణంగా పరిగణించవచ్చు. అయినప్పటికీ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే చాలా జీవులలో స్పృహ ఉన్నప్పటికీ నేర్చుకునే సామర్ధ్యం వుండకపోవడానికి పూర్తిగా అవకాశం వుంది.

ఇవి మానవేతర జీవులు ప్రదర్శించే ప్రవర్తనలకు కొన్ని ఉదాహరణలు. కానీ ఈ జీవులు మనం అనుకునట్టు కేవలం బాధ , సంతోషం కలిగినప్పుడు మాత్రమే కాకుండా ఇతర స్థితులలో కూడా చాలా విధాలుగా ప్రవర్తిస్తాయి. ఒక జీవి భావాలు కలిగి వుందా లేదా అని నిర్ధారించడానికి, నిర్దిష్ట సందర్భాల్లో అది ఎలా స్పందిస్తుందో అని కాకుండా సాధారణంగా ఎలా ప్రవర్తిస్తుందో అనేది ప్రదానం. ఒక జంతువు బాధ లేదా ఆనందం తాలుక చిహ్నాలను ప్రదర్శించకపోయినా, దాని ప్రవర్తన అది మనోభావాలను కలిగి వుందా లేదా అని మనం అర్ధం చేసుకోడానికి దారి తీస్తుంది. ఇక్కడ దానికి కారణం చెప్పబడింది.

జంతువులు కొన్ని నిర్దిష్టమైన ప్రవర్తనల సహాయంతో తమను తాము సజీవంగా ఉంచుకుంటాయి (మరియు పరిణామ కోణంలో తమ జన్యువులను ముందు తరాలకు అందించడానికి). అందువల్ల, ఆ జీవులు వాటి మనుగడకు ముప్పు కలిగించే వాటిని నివారించి మరియు తమను ప్రోత్సహించే జీవులతో మనుగడ సాగిస్తాయి. దీనికి మూలం ప్రవర్తన. మనుగడ సాగించడానికి మరియు జన్యువులను ముందు తరాలకు అందించడానికి జీవులకు వుండే స్పృహ ఎక్కువ అవకాసాలను కలిగిస్తుంది, ఎందుకంటే అది జీవులు ఏ విదంగా ప్రవర్తిస్తున్నాయో నిర్ధారిస్తుంది. ఇది ప్రేరణ ద్వారా జరుగుతుంది. సానుకూల మరియు ప్రతికూల అనుభవాలు వాటిని అనుకూలంగా లేక వ్యతిరేకంగా ప్రకటితం అయ్యేలా ప్రేరేపిస్తాయి. అనుకూల మరియు ప్రతికూల అనుభవాలకు కలిగే ప్రతిస్పందనని మనం జీవులలో ప్రోగ్రాం చేయలేము దీని వల్ల స్పృహ కలిగే సామర్ధ్యాన్ని కలిగించే ప్రేరణ కరువైపోతుంది.2

అందువల్ల, స్పృహను కలిగి ఉండడమే ఒక జంతువు సంక్లిష్ట మార్గాల్లో ఎందుకు ప్రవర్తిస్తుందో నిర్ధారించడానికి ఆమోదయోగ్యమైన వివరణ అని మేము కనుగొన్నాము. ఏ విధంగానూ సాధారణ ప్రవర్తన లేని జంతులు పెద్ద సంఖ్యలో వున్నాయి. ఈ జంతువులు చాల భిన్నమైన పరిస్థితులు ఎదుర్కుంటాయి, మనుగడ సాగించటానికి అవి దానికి తగినట్టు స్పందిస్తాయి. స్పృహని పరిగణలోకి తీసుకోకుండా దీనికి అవసరమైన ప్లాస్టిసిటీ (ఒక స్థితి నుంచి మరో స్థితి కి మారగలిగే లక్షణం) ని వివరించడం కష్టం.

పరిణామ పరిశీలనలు

ప్రవర్తన గురించి మాట్లాడేటప్పుడు , స్పృహ గల జీవులు మొదటి స్థానంలో ఎందుకు వున్నాయో వివరించే పరిణామాన్ని మనం పరిగణిస్తాం. అలాంటి జీవులు మనుగడలో వుంటే , బహుశా అది స్పృహ వాటి మనుగడ అవకాసాలను మరియు ముందు తరాలను జన్యువులను అందించే అవకాసాలను కల్పించడం వల్ల కావచ్చు.

ఒక జీవి అనుకూల లేక ప్రతికూల అనుభవాలు పొందే సామర్ధ్యం కలిగి వుందా లేదా అని నిర్ధారణకు రావడానికి పరిణామ పరిశీలనలో రెండు మార్గాలు వున్నాయి. మొదటిది ఒక జంతువు యొక్క జీవితం ఎటువంటి పరిస్థితులతో చుట్టుముట్టి వుంది మరియు నిర్దిష్ట మార్గాల్లో ప్రవర్తించడానికి ఆ జంతువు కి గల సామర్ధ్యం. పైన సూచించిన విధంగా, అనుభూతి చెందే సామర్ధ్యం పలు విధాల పని చేసే సామర్ధ్యాన్ని ఇచ్చే పరిణామ చరిత్ర వల్ల పెరుగుతుంది.3

ఒక జీవి యొక్క ప్రవర్తన చాలా ప్లాస్టిసిటీ (ఒక స్థితి నుంచి మరో స్థితి కి మారగలిగే లక్షణం) గా అంటే సంక్లిష్టంగా మరియు పరిస్థితులకు అనుగుణంగా వున్నప్పుడు ప్రేరణ ప్రభావం చూపడాన్ని ఇప్పుడు మనం చూసాం. ఒక జంతువు ముందు తరాలకు జన్యువులను అందించడం అనేది చాలా సాధారణ ప్రవర్తన, దానికి స్పృహ కలిగి వుండే సామర్ధ్యాన్ని కలిగి వుండడం అంత అవసరమైనది కాదు. ఈ సందర్భాల్లో , స్పృహ శక్తిని వృధాగా ఉపయోగించుకుంటుంది, ఎందుకంటే ఇది చాలా జీవక్రియ వ్యయాన్ని కలిగివుంటుంది. మనుషుల విషయంలో, సుమారు 20% శక్తి మెదడు ని సజీవంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఈ శక్తిలో ఒక భాగం వ్యక్తిగత అనుభవంతో సంబంధంలేని కార్యక్రమాలకు వినియోగించబడుతుంది, కాని చాల ముఖ్యమైన భాగం స్పృహ ఉత్పత్తి మరియు నిర్వహణలో వినియోగించబడుతుంది. మనుషుల కన్నా తక్కువ మెదడు-శరీర ద్రవ్య నిష్పత్తి గల జంతువులలో , ఈ భాగం అంత ఎక్కువగా ఉండదు, కానీ మొత్తానికి చాలా ఎక్కువ. మనుగడ సాగించేలా ప్రవర్తించడానికి స్పృహ అంత ముఖ్యం కాకపోతే, అది అదనపు భారం అవుతుంది, ఎందుకంటే ఇది ఇతర ఉపయోగకరమైన పనులకు వినియోగించబడే శక్తి ని అనవసరంగా వినియోగిస్తుంది.4 మొక్కలు లేదా ఫంగి( శిలీంధ్రాలు) వంటి కదలలేని జీవులకు ఇది జరుగుతుంది.

పరిణామాత్మక పరిశీలనలో ఒక జీవి మనోభావాలను కలిగి వుందా లేదా అని నిర్ణయించడానికి మనకు ఉపయోగపడే మరొక మార్గం : బంధుత్వం. పరిణామ వృక్షంలో చాలా దగ్గర సంబంధం వున్న జంతువులను, ఇటీవల ఏర్పడిన జాతులను పరిగణించండి. దానిని నమ్మడానికి మనకి ఒక కారణం వుంది, ఈ రెండు జాతులలో ఒక జాతిలోని సభ్యులు స్పృహ కలిగి వుంటే, రెండో జాతిలో సభ్యులు కూడా సృహ కలిగి వుంటారు.5

శరీరశాస్త్రము

కేంద్రీకృత నాడీ వ్యవస్థ ఉనికి

ఒక జీవి మనోభావాలను కలిగి వుందా లేదా అని నిర్ధారించే ప్రమాణాలు దాని శరీరశాస్త్రం నుండి దొరికే ఆధారాలపై ఆధారపడి వుంటాయి. భౌతిక ఆహార్యం తదనుగుణ పనితీరు జీవికి స్పృహని అనుభూతి చెందే అవకాశం కల్పిస్తాయి. ఏదైమైన, నేటికీ ఇది ఎలా జరుగుతుందో మనకి తెలియదు. భావాలు కలిగి వుండాలంటే , జీవి ఒక నిర్దిష్ట భౌతిక నిర్మాణం కలిగి వుండాలి, కానీ ఈ నిర్మాణానికి సంబంధించి మనకు కేవలం నామమాత్రపు అవగాహనా మాత్రమే వుంది. ఇది స్పృహ యొక్క సమస్య విభాగం లో వివరించబడింది.

భావాలు కలిగి ఉండడానికి కేవలం నాడీ వ్యవస్థ వుంటే సరిపోదు, ఒకవేళ ఆ నాడీ వ్యవస్థ కేంద్రీకృతం కాకపోతే. నేటికి మనకి తెలిసింది కేవలం కేంద్రీకృత నాడీ వ్యవస్థ మాత్రమే భావాలు కలిగి ఉండడానికి ముఖ్యం.

సాధారణ నాడీ వ్యవస్థలు కేవలం నరాల గాంగ్లియా(నరాల సముదాయం) ను కలిగి ఉంటాయి, ఇవి వేర్వేరు నరాల కలయికతో తయారవుతాయి. అవి చాలా సరళమైన నిర్మాణాల నుంచి పూర్తిగా ఏర్పడిన మెదడు వరకు సంక్లిష్టతలో మారవచ్చు. పూర్తిగా ఏర్పడిన మెదళ్ళలో కూడా అంతర్గతంగా గణనీయ మార్పులు చోటుచేసుకోవచ్చు. సాధారణ మెదడు సంక్లిష్ట నరాల గాంగ్లియా కంటే కాస్త అభివృద్ధి చెంది వుంటాది.

అంతేకాక, కేంద్రీకరణ స్థాయిలో కూడా చాలా వైవిధ్యం ఉంటుంది. ఉదాహరణకు, ఆక్టోపోడ్లు అనేక సకశేరుకాల (వెన్నెముక గల జీవులు) కంటే చాలా సంక్లిష్టమైన కేంద్రీకృత నాడీ వ్యవస్థను కలిగి ఉన్న మొలస్క్లు. వాటి పరిణామ చరిత్రలో తేడాల కారణంగా ఆక్టోపోడ్లు మరియు సకశేరుకాల యొక్క నాడీ వ్యవస్థ చాలా భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ, ఆక్టోపోడ్ల ప్రవర్తనలో సంక్లిష్టత అవి స్పృహ గల జీవులు అనే నిర్ధారణకు వచ్చేలా చేస్తాది. ఈ కారణంగా, భావాలు కలిగి ఉండడానికి మనకు, క్షీరదాలకు, సకశేరుకాలకు ఉన్నట్టు మెదడు అమరిక ఉండవలసిన అవసరం లేదని మనకు తెలిసింది.6 వాస్తవానికి, అనుకూల మరియు ప్రతికూల అనుభవాలకు అవసరమైన నాడీ వ్యవస్థ యొక్క విధానం చాలా సాధారణంగా ఉంటుందని ఇది తెలియపరుస్తుంది. ఆక్టోపస్ లేదా క్షీరదం యొక్క నాడీ వ్యవస్థలో సంక్లిష్టత ఆవిర్భావానికి ముందు వున్న ప్రాచీన నిర్మాణంలో ఇలాంటి విధానం గ్రహించబడుతుంది. స్పృహ కలిగి ఉన్న జంతువులు చాలా ఎక్కువ అనే నిర్ధారణకు ఇది దారితీస్తుంది.

నరాల నిర్మాణం కాకుండా ఇతర శారీరక ప్రమాణాలు

ఒక జీవి స్పృహ కలిగి ఉందో లేదో నిర్ణయించడానికి నరాల నిర్మాణం ఒక ముఖ్యమైన ప్రమాణం, కానీ ఇతర ప్రమాణాలు కూడా ఉన్నాయి. వీటి ఆధారంగా మాత్రమే, కేంద్రీకృత నాడీ వ్యవస్థ లేని జీవి స్పృహతో ఉందని మనం నిర్ధారించలేము; కానీ అవి కేంద్రీకృత నాడీ వ్యవస్థను కలిగి ఉన్న జీవుల విషయంలో స్పృహను నిర్ధారించడానికి అదనంగా చాల ఆధారాలను అందిస్తాయి.

ఈ ప్రమాణాలలో ఒకటి అనేక రసాయనాలను సూచిస్తుంది, ఇవి చాలా సందర్భాల్లో నొప్పిని తగ్గించేవిగా పనిచేస్తాయి. మనం స్పృహ కలిగి వున్నాయి అనుకునే అనేక జంతువులు మనకు అనవసరమైన బాధ నుంచి ఉపసమనం కలిగించే అనేక పదార్ధాలను ఉత్పత్తి చేస్తాయి (ఉదాహరణకు మనకి భయం కలిగించే ఏదో ఒక విషయం నుంచి దూరంగా వెళ్లిపోవడం). అయినప్పటికీ, చాలా సాధారమైన కేంద్రీకృత నాడీ వ్యవస్థతో పెద్ద సంఖ్యలో వున్న అకశేరుకాలు (వెన్నెముక లేని జీవులు) కూడా ఈ పదార్థాలను స్రవిస్తాయి. ఈ జీవులలో ఈ పదార్ధాల పనితీరు భిన్నంగా ఉండవచ్చు, కాని సూత్రప్రాయంగా అవి పరిణామ పరిశీలనల ఆధారంగా ఒకే పాత్రను పోషిస్తాయని అనుకోవడం సహజం.7

నోకిసెప్టర్స్ (మిరపకాయలు వంటివి తిన్నప్పుడు కలిగే మంటను అనుభూతి చెందగలిగే భాగాలు) కలిగి ఉండటం అనేది మరొక ప్రమాణం. కణాలలో జరిగే నష్టం యొక్క సమాచారాన్ని మెదడుకు అందించడం వీటి పని.8 నోకిసెప్షన్ అంటే విషపూరితమైన లేదా హానికరమైన ఇంద్రియ ఇబ్బందులను గుర్తించడం. ఒక జీవి యొక్క కణాలు దెబ్బతినే విధంగా ప్రభావితమైనప్పుడు ఇది జరుగుతుంది. కణాలలో ఈ నష్టం కనుగొనబడింది మరియు ఆ సమాచారం నాడీ వ్యవస్థ ద్వారా ప్రసారం చేయబడుతుంది. నొప్పి మరియు ఇతర శారీరక అనుభూతులను అనుభవించేలా చేసే విధానం ఇది(వేడి లేదా చలి వంటివి).

అందువల్ల, మనోభావాల అధ్యయనాన్ని నోకిసెప్షన్ అధ్యయనానికి తగ్గించవచ్చని కొందరు భావించవచ్చు. అయితే ఇలా అనుకోవడం పొరపాటు. కారణం ఏమిటంటే, నోకిసెప్షన్ ద్వారా స్వీకరించబడిన సమాచారం నొప్పి యొక్క సంచలనం కాదు. నొప్పిని నిజంగా అనుభవించాలంటే, అది మెదడు చేత తేసుకోబడి దానిని మనం అనుభూతి చెందేలా ప్రాసెస్ చేయబడాలి. ఏదేమైనా, నోకిసెప్షన్ ద్వారా సమాచారం అందడం అనేది మనం బాధ అనుభవించడానికి సమానం కానప్పటికీ, మనలాంటి జంతువులలో ఇది ఒక ముందస్తు చర్య వంటిది. అంతేకాక, నోకిసెప్షన్ కు అదనపు చర్య లేదు. నోకిసెప్షన్ జరిగేలా చేసే కేంద్రీకృత నాడీ వ్యవస్థ గల జీవిని పరిగానించినప్పుడు, ఆ జీవికి బాధ, ఆనందం పొందే సామర్ధ్యం వుంది అని మనం ఊహించవచ్చు( అవి స్పృహతో వుంటాయి).

మనం ఈ విషయం చెప్పగలిగినప్పటికీ, ఏ జీవులు భావాలు కలిగి వున్నాయి అనే సమస్య ఇంకా పరిష్కరించబడలేదు, ఎందుకంటే నోకిసెప్టర్లు లేకపోయినా కూడా అనుభవాలను పొందగలిగే సామర్ధ్యం గల జీవులు వున్నాయి. చాలా సాధారణమైన నొప్పిని అందించగలిగే వ్యవస్థ గల జంతువుల విషయంలో ఇది సాధ్యమవుతుంది.


తరువాత చదవదగినవి

Allen, C. (1992) “Mental content and evolutionary explanation”, Biology and Philosophy, 7, pp. 1-12.

Allen, C. & Bekoff, M. (1997) Species of mind, Cambridge: MIT Press.

Baars, B. J.  (2001) “There are no known differences in brain mechanisms of consciousness between humans and other mammals”, Animal Welfare, 10, suppl. 1, pp. 31-40.

Beshkar, M. (2008) “The presence of consciousness in the absence of the cerebral cortex”, Synapse, 62, pp. 553-556.

Chandroo, K. P.; Yue, S. & Moccia, R. D. (2004) “An evaluation of current perspectives on consciousness and pain in fishes”, Fish and Fisheries, 5, pp. 281-295.

Darwin, C. (1896 [1871]) The descent of man and selection in relation to sex, New York: D. Appleton and Co. [చూడబడిన తేదీ 12 జనవరి 2014].

Dawkins, M. S. (1993) Through our eyes only? The search for animal consciousness, New York: W. H. Freeman.

Dawkins, M. S. (2001) “Who needs consciousness?”, Animal Welfare, 10, suppl. 1, pp. 19-29.

DeGrazia, D. (1996) Taking animals seriously: Mental life & moral status, Cambridge: Cambridge University Press.

Dretske, F. I. (1999) “Machines, plants and animals: the origins of agency”, Erkenntnis, 51, pp. 19-31.

Edelman D. B. & Seth, A. K. (2009) “Animal consciousness: A synthetic approach”, Trends in Neuroscience, 9, pp. 476-484.

Farah, M. J. (2008) “Neuroethics and the problem of other minds: implications of neuroscience for the moral status of brain-damaged patients and nonhuman animals”, Neuroethics, 1, pp. 9-18.

Griffin, D. R. & Speck, G. B. (2004) “New evidence of animal consciousness”, Animal Cognition, 7, pp. 5-18.

Jamieson, D. (1998) “Science, knowledge, and animals minds”, Proceedings of the Aristotelian Society, 98, pp. 79-102.

Panksepp, J. (2004) Affective neuroscience: The foundations of human and animal emotions, New York: Oxford University Press.

Radner, D. & Radner, M. (1989) Animal consciousness, Buffalo: Prometheus.

Robinson, W. S.  (1997) “Some nonhuman animals can have pains in a morally relevant sense”, Biology and Philosophy, 12, pp. 51-71.

Sneddon, L. U. (2009) “Pain perception in fish: Indicators and endpoints”, ILAR Journal, 50, pp. 338-342 [చూడబడిన తేదీ 30 December 2020].


గమనికలు

1 Rollin, B. E. (1989) The unheeded cry: Animal consciousness, animal pain and science, Oxford: Oxford University Press.

2 Gherardi, F. (2009) “Behavioural indicators of pain in crustacean decapods”, Annali dell’Istituto Superiore di Sanità, 45, pp. 432-438.

3 Damasio, A. R. (1999) The feeling of what happens: Body and emotion in the making of consciousness, San Diego: Harcourt.

4 Ng, Y.-K. (1995) “Towards welfare biology: Evolutionary economics of animal consciousness and suffering”, Biology and Philosophy, 10, pp. 255-285.

5 Griffin, D. R. (1981) The question of animal awareness: Evolutionary continuity of mental experience, New York: Rockefeller University Press. Cabanac, M.; Cabanac, A. J.; Parent, A. (2009) “The emergence of consciousness in phylogeny”, Behavioural Brain Research, 198, pp. 267-272. Grinde, B. (2013) “The evolutionary rationale for consciousness” Biological Theory, 7, pp. 227-236.

6 Smith, J. A. (1991) “A question of pain in invertebrates”, ILAR Journal, 33, pp. 25-31 [చూడబడిన తేదీ 24 December 2013]. Mather, J. A. (2001) “Animal suffering: An invertebrate perspective”, Journal of Applied Animal Welfare Science, 4, pp. 151-156. Mather, J. A. & Anderson, R. C. (2007) “Ethics and invertebrates: A cephalopod perspective”, Diseases of Aquatic Organisms, 75, pp. 119-129 [చూడబడిన తేదీ 9 April 2017].

7 Kavaliers, M.; Hirst, M. & Tesky, G. C. (1983) “A functional role for an opiate system in snail thermal behaviour”, Science, 220, pp. 99-101.

8 Sneddon, L. U. (2004) “Evolution of nociception in vertebrates: Comparative analysis of lower vertebrates”, Brain Research Reviews, 46, pp. 123-130.