జనాభా ఘణంకాలు మరియు జంతువుల బాధ

జనాభా ఘణంకాలు మరియు జంతువుల బాధ

చాలా జంతువులు మనుగడలోకి వచ్చిన కొద్దిసేపటికే చనిపోతాయి, తరచుగా బాధాకరమైన లేదా భయపెట్టే విధంగా. పునరుత్పత్తి వ్యూహాల కారణంగా చాలా జంతువులు చిన్నతనంలోనే చనిపోతాయి.

జనాభా ఘణంకాలు అనేది జీవరాశుల పెరుగుదల మరియు మార్పును ప్రభావితం చేసే అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ, కాలక్రమంలో జీవుల జనాభా ఎలా మరియు ఎందుకు మారుతుంది అనే అధ్యయనం. ఈ కారకాల మధ్య పరస్పర చర్యను అర్ధం చేసుకోవడం వల్ల వివిధ జంతువుల ఇబ్బందులు మరియు శ్రేయస్సు పట్ల మెరుగైన అభిప్రాయం కలుగుతుంది ఇంకా వాటికి సహాయపడడానికి అవసరమైన చర్యలను సమర్ధవంతంగా వ్యూహరచన చేయడానికి అవకాసమిస్తుంది.

జనాభా ఘణంకాల అధ్యయనంలో మరణం మరియు పునరుత్పత్తి రెండు ముఖ్యమైన అంశాలు. ఏవైనా అడవి జంతువుల జనాభా పెరుగుదల, క్షీణత లేదా నిర్వహణను జనాభా ఘణంకాలు నిర్ణయిస్తాయి, ఇంకా ఆ గుంపులోని జంతువులు వ్యక్తిగతంగా అనుభవించే శ్రేయస్సును గణనీయంగా ప్రభావితం చేయవచ్చు. జీవిత దశలలో ఎన్ని మనుగడ సాగిస్తున్నాయి అనే దాని దానితో పోలిస్తే సగటున ఎన్ని జంతువులు చనిపోతున్నాయో తెలుసుకోవడానికి జీవిత చరిత్ర సిద్ధాంతంతో పాటు జనాభా ఘణంకాలు మనకు సహాయపడతాయి. ఎంత భయంకరమైన, భాదాకరమైన చవులు వుంటాయి అనే దానితో ఈ సమాచారాన్ని కలిపి పరిశీలిస్తే అడవి జంతువుల జీవన నాణ్యత పట్ల సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది.

పునరుత్పత్తి వ్యూహాలు మరియు జంతువుల మరణం

అడవిలో జంతువుల బాధ ఎంత విస్తృతంగా ఉందో అంచనా వేయడానికి, వివిధ అంశాలపై ఆధారపడి జనాభా ఎలా మారుతుందో గమనించడం ద్వారా మనం ప్రారంభించవచ్చు. ఒక అంశం ఏమిటంటే, జంతువులు సమీమ ప్రాంతాల నుంచి గుంపులో చేరడానికి వలస వచ్చినప్పుడు, ఆ గుంపు యొక్క పరిమాణం ఇంకా అవసరాలు పెరుగుతాయి, అయితే ఈ జంతువులు ఏ గుంపు నుంచి వచ్చాయో దాని పరిమాణం తగ్గుతుంది.

ఏదేమైనా, జనాభా పరిమాణం పైన పేర్కొన్న కారకాలచే ఎక్కువగా ప్రభావితమవుతుంది: జననం మరియు మరణం. కాలం గడిచేకొద్దీ జనాభా స్థిరంగా ఉండాలంటే, జననాల సంఖ్య మరణాల సంఖ్యతో సరిపోవాలి. ఆహరం మరియు ఆశ్రయం వంటి వనరులు పరిమితంగా వుండడం వల్ల సగటున ఒక్కొక్క జంతువుకి కేవలం ఒక పిల్ల మాత్రమే యవ్వన వయస్సు వరకు జీవించగలదు. దీని అర్థం తక్కువ సంతానం ఉన్న జంతువులు తక్కువ శిశు మరణాలను కలిగి ఉంటాయి మరియు పెద్ద సంఖ్యలో సంతానం ఉన్న జంతువులు ఎక్కువ శిశు మరణాలు కలిగి ఉంటాయి. మొత్తం జనాభాలో ఎక్కువ భాగం అప్పుడే పుట్టిన చిన్న జంతువులు మరియు చావుకి సిద్ధంగా వున్న జంతువులు వుంటాయి. దీని అర్ధం జనాభా క్షీణించింది అని కాదు.

పరిసరాల్లోని ఆహార లభ్యతా, ఇతర జీవులను తినే జంతువుల ఉనికి వంటి పరిమిత కారకాలలో మార్పు కారణంగా కాలక్రమేనా జనాభా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ఈ పరిమితులు కొన్ని మారినప్పుడు జనాభా పెరగవచ్చు. ఉదాహరణకు, ఇతర జీవులను తినే జంతువులు అంతరించిపోతే, అవి తినే జంతువులు మనుగడ సాగించే అవకాశాలు మెరుగు అవుతాయి – ప్రతి జంతువు యొక్క సంతానంలో ఒకటి కంటే ఎక్కువ జీవించగలవు. ఆహార లభ్యత వంటి పెరుగుదలను నివారించే మరొక పరిమితిని ఎదుర్కునే వరకు జనాభా క్రమంగా పెరుగుతుంది. ఎదుగుతున్న కొద్దీ కొన్ని జంతువులు చనిపోయినప్పటికీ, వాటి ఎదుగుదల పరిమితం ఐనప్ప్పుడు భవిష్యత్తు తరాలు ఎక్కువ మరణాలను భరిస్తాయి, ఎందుకంటే ఇప్పుడు పెద్ద మరియు చిన్న జంతువుల మరణాలు పెరుగుతాయి – వనరుల పరిమితి వల్ల మరొకసారి ఒక్కొక్క జంతువుకు సంబంధించి ఒక పిల్ల మాత్రమే జీవించగలదు.

కొన్ని జంతువులు చాలా తక్కువ వారసులను కలిగి ఉండటం మరియు వాటిని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా పునరుత్పత్తి చేస్తాయి. అవి పునరుత్పత్తి చేసిన ప్రతిసారి కేవలం ఒక జంతువుకు జన్మనివ్వవచ్చు లేదా కేవలం ఒక గుడ్డు పెట్టవచ్చు. అవి తమ జన్యువులను దాటిపోయే అసమానతలను మెరుగుపరిచే లక్షణాలలో ఎక్కువ శక్తిని ఉపయోగించడం ద్వారా అధిక మరణాలను నివారిస్తాయి. అలాంటి లక్షణాలలో కొన్ని, పిల్లలు ఎదుర్కునే ప్రమాదాల నుంచి రక్షించడానికి ఇంకా వాటి కోసం సిద్దం చేయడానికి తల్లిదండ్రులు కల్పించే రక్షణ, ఒకటి కంటే ఎక్కువ సార్లు పునరుత్పత్తి చేయడానికి వీలు కల్పించే సుదీర్గ జీవితకాలం, మరియు అవి ఎదుర్కునే సవాళ్ళను అధిగమించే అవకాసం పెంచే మానసిక సామర్ధ్యాలు.

దురదృష్టవశాత్తు, ఈ పునరుత్పత్తి వ్యూహాన్ని అనుసరించే జంతువుల జాతులు చాలా తక్కువ. కోతులు, సెటాసియన్లు (తిమింగలాలు, డాల్ఫిన్లు, సీల్స్ మరియు పోర్పోయిస్‌లు), ఎలుగుబంట్లు, ఏనుగులు వంటి కొన్ని క్షీరదాలు మరియు ఇతర శాకాహారులు మరియు ఆల్బట్రోస్ వంటి కొన్ని పక్షులు ఈ రకమైన పునరుత్పత్తి వ్యూహాన్ని కలిగి ఉన్నాయి. ఏదేమైనా, అధిక సంఖ్యలో జంతువులు విభిన్న వ్యూహాన్ని అనుసరిస్తాయి, తరచుగా మరియు పెద్ద సంఖ్యలో పునరుత్పత్తి చేస్తాయి.

ఈ వ్యూహానికి చాలా విలువ ఉంది. ఈ విధంగా పునరుత్పత్తి చేసే జంతువులు మనుగడను పెంచే లక్షణాలను కలిగి ఉండకపోవచ్చు. ఉదాహరణకు, మనుగడ అవకాశాన్ని కొంత కల్పించినప్పటికీ, పునరుత్పత్తి అవకాశాన్ని తగ్గించే లక్షణం ఎంపిక కాకపోవచ్చు. ఎందుకంటే పునరుత్పత్తి వ్యూహం పునరుత్పత్తిని పెంచుతుంది, మనుగడను కాదు. అవి అధిక సంఖ్యలో పునరుత్పత్తి చేపడుతున్నాయి, వాటిలో చాలా జంతువులు తక్కువ జీవితకాలం కలిగి వుంటాయి, దానికి కారణం ఇతర జంతువుల చేత తినబడడం, ఆకలితో చనిపోవడం లేదా అడవి జంతువులకు ఎదురయ్యే ఇతర హాని నుంచి తప్పించుకోలేకపోవడం. అవి భావాలు కలిగినవి కాబట్టి, వాటి చిన్న జీవిత కాలంలో అవి ఎక్కువగా బాధపడవచ్చు.చేయగలదు

ఈ పునరుత్పత్తి వ్యూహాన్ని ప్రదర్శించే జంతువుల ఉదాహరణలలో ఉభయచరాలు మరియు సరీసృపాలు ఉన్నాయి, వీటి గుంపు పరిమాణాలు పదుల, వందల, మరియు సాధారణంగా 25,000 దాటి ఉంటాయి.1 అట్లాంటిక్ సాల్మన్ వంటి కొన్ని జాతుల చేపలు ప్రతి విడతకు 20,000 గుడ్లను ఉత్పత్తి చేస్తాయి, ఇతర సాధారణ జాతుల సాల్మన్, కాడ్ మరియు ట్యూనా మిలియన్లలో పునరుత్పత్తి చేస్తాయి.2 అకశేరుకాలలో (వెన్నెముక లేని జీవులు) పెద్ద సంఖ్యలో గుడ్లు పెట్టడం కూడా సాధారణం. ఉదాహరణకు, క్రస్టేసియన్లలో, క్రేఫిష్ ఒక్కో విడతకి వందల గుడ్లను ఉత్పత్తి చేయగలదు,3 మరియు మొలస్క్లలో ఆక్టోపస్‌లు వందల వేల సంఖ్యలో పునరుత్పత్తి చేయగలవు. అనేక ఆర్త్రోపోడ్‌లతో సహా భూఆధారిత అకశేరుకాలు (వెన్నెముక లేని జీవులు) ఒకేసారి వందల, వేల మరియు కొన్ని సందర్భాల్లో లక్షలాది గుడ్లు పెట్టగలవు.4

జంతువుల బాధకు కారణమైన పరిణామాలు

పెద్ద సంఖ్యలో సంతానానికి దారితీసే పునరుత్పత్తి వ్యూహాల ప్రాబల్యం జంతువుల బాధకు ముఖ్యమైన పరిణామాలను కలిగి ఉంది.5

కొన్ని జంతువులు త్వరిత మరణం కారణంగా చిన్న నొప్పిని అనుభవించినప్పటికీ, అనేక ఇతర జంతువులు సుదీర్ఘమైన మరణంతో తీవ్రంగా బాధపడుతుంటాయి మరియు అవి చిన్న వయస్సులోనే చనిపోతాయి. దీని అర్థం వాటి జీవితాలలో ముఖ్యమైన అనుకూల అనుభవాలను పొందే అవకాశం వాటికి ఉండకపోవచ్చు; వాస్తవానికి, అవి మరణించే భయంకరమైన అనుభవంతో పాటుగా కొన్ని అనుభవాలను మాత్రమే కలిగి ఉండవచ్చు. వాటి మరణాలు సహజమైనవి మరియు వాటి జీవిత చరిత్రలో ఒక భాగం కాబట్టి, ఇది నైతిక సమస్యగా అనిపించకపోవచ్చు. మనుషులు మరియు పెంపుడు జంతువులకు హాని జరిగినపుడు సహాయం చేయాలి అని మనం అనుకుంటే, అడవి జంతువుల విషయంలో కేవలం అవి ఎక్కడ నివసిస్తున్నాయో అనే విషయాన్నీ ఆధారంగా చేసుకొని బిన్నంగా స్పందించడం సమంజసం కాదు. అవి హానిని అనుభవించే విధానం మానవులు హానిని అనుభవించే విధానానికి అంత భిన్నంగా లేదని చాలా ఆధారాలు తెలియచేస్తున్నాయి,అడవి జంతువులకు కూడా పెంపుడు జంతువులు మరియు మానవుల లాగా హాని కలిగించావచ్చా? అనే అంశంలో వివరించినట్టు ఇది నైతికంగా కూడా సంబందితమైనది.

అదనంగా, చాలా జంతువులు వాటి జీవితాలను చిన్నవిగా, అభివృద్ధి చెందనివిగా ప్రరంభిస్తున్నాయి అంటేదాని అర్ధం వాటికి ఎటువంటి భావాలు లేవు అని కాదు. ఉదాహరణకు, పెద్ద జీబ్రాఫిష్ హానికరమైన ఉద్దీపనలకు భావాలను సూచించే విధంగా ప్రతిస్పందిస్తుందని మరియు లార్వా జీబ్రాఫిష్ ఇదే విధంగా ప్రతిస్పందిస్తుందని చూపబడింది.6 ఉనికిలోకి వచ్చిన కొద్దికాలానికే చాలా జంతువులు చనిపోతాయని మనకి తెలుసు, ఎందుకంటే చాలా జంతువులకు, వాటి సంతానం మనుగడ సాగించడానికి స్థలం లేదా వనరులు లేవు. పర్యవసానంగా, ప్రకృతిలో, ఆనందం మరియు ఆసక్తి సంతృప్తి వంటి అనుకూల స్థితుల కంటే నొప్పి మరియు బాధ వంటి ప్రతికూల పరిస్థితులు ప్రబలుతాయని మనం నిర్ధారించవచ్చు.

యుక్తవయస్సు వరకు జీవించే కొన్ని జంతువులు స్వయంగా చాలా సంతోషంగా మరియు సహాయం అవసరం లేని స్థితిలో వున్నాయని దీని అర్థం కాదు. అనేక సందర్భాల్లో, ఈ జంతువులు వ్యాధి, పోషకాహారలోపం మరియు దాహం, వాతావరణ పరిస్థితులు, ఇతర జంతువుల చేత వేటాడబడడం, గాయాలు మరియు మానసిక ఒత్తిడి వంటి కారణాల వలన సుదీర్ఘమైన ఇబ్బందులతో కూడిన జీవితాలను కలిగి ఉంటాయి. అందువల్ల, ఒక జంతువు తన బాల్యాన్ని దాటినప్పటికీ, దాని జీవితం ఆనందం కంటే ఎక్కువ ఇబ్బందులను కలిగి ఉండవచ్చు. ఎదిగిన జంతువులు మంచి జీవితాలను కలిగి ఉన్నప్పటికీ, గుంపు యొక్క ఇబ్బందుల అనుభవాలు ఇప్పటికీ అనుకూల అనుభవాలను మించి వుంటాయి, ఎందుకంటే మనుగడ సాగించని మరియు భయంకరమైన జీవితాలను కలిగి ఉన్న పిల్లలు పెద్ద సంఖ్యలో వుండడం వల్ల.

అన్ని జంతువుల జనాభా గణనీయమైన బాధ మరియు మరణాన్ని ఎదుర్కొంటుంది

బాల్యంలో ఎక్కువ మనుగడ స్థాయి వున్న జాతికి చెందిన జంతువులు కూడా యవ్వనాన్ని చేరే లోగా మరణిస్తాయి. అవి ప్రతి పునరుత్పత్తి కాలానికీ ఒక సంతానానికి మాత్రమే జన్మనిచ్చినప్పటికీ, అవి తమ జీవితకాలంలో చాలా మంది సంతానాన్ని కలిగి ఉంటాయి. వాటి పునరుత్పత్తి అలవాట్లతో సంబంధం లేకుండా, జనాభా స్థిరంగా ఉండటానికి, ప్రతి జంతువుకూ సగటున ఒక సంతానం మాత్రమే పునరుత్పత్తి ద్వారా వాటి జన్యువులను ముందుకు తేసుకువేల్లెలా జీవించగలుగుతుంది.

అడవిలో ముసలివి అయిపోయిన మరియు అనారోగ్యంతో ఉన్న జంతువులు మాత్రమే చనిపోతాయని, చిన్న మరియు ఆరోగ్యకరమైన జంతువులు సంతోషంగా జీవిస్తాయని తరచుగా చెబుతారు. ఇది సానుకూలంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ముసలి మరియు జబ్బుపడిన జంతువుల మరణం వాటి వ్యాధి లేదా ఇతర వయస్సు-సంబంధిత హాని నుండి అవి అనుభవించే నొప్పి మరియు బాధ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే, ఇది అలా కాదని సాక్ష్యాలు సూచిస్తున్నాయి. చిన్న వయస్సులో వున్న జంతువులు ముసలి జంతువుల కంటే త్వరగా చనిపోయే అవకాశం ఉందని చూపించే కొన్ని ఉదాహరణలు క్రింద ఇవ్వబడ్డాయి.

మిన్నెసోటాలోని సెంట్రల్ సుపీరియర్ నేషనల్ ఫారెస్ట్‌లో, 203 తెల్ల తోక జింకలు 1973 నుండి 1983-1984 శీతాకాలం వరకు గమనించబడ్డాయి; ఈ సమయంలో మూడింట ఒక వంతు జింకలు చనిపోయాయి, ఆడ మగ కలిపి, ఈ అధ్యయనంలో ఎక్కువగా చనిపోయే జింకలు ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్నవి.7

మరొక అధ్యయనం 1950 మరియు 1969 మధ్య 439 ఐల్ రాయల్ మూస్ మరణాలను విశ్లేషించింది. మొత్తం మరణాలలో 45% శిశు మరణాలు సంభవించాయి.8

స్కాట్లాండ్‌లో సోయా గొర్రెల సమూహం యొక్క జనాభా సాంద్రత హెక్టారుకు 2.2 కంటే పెరిగినప్పుడు శీతాకాలంలో భారీ సంఖ్యలో సంభవించే మరణాల గురించి డాక్యుమెంట్ చేయబడిన పరిశోధన ఉంది. 50% పెద్ద గొర్రెలతో పోలిస్తే 90% కంటే ఎక్కువ గొర్రెపిల్లలు మరియు 70% ఏడాది వయస్సు పిల్లలు ఈ పరిస్థితులలో చనిపోతాయి.9

పక్షులలో కూడా ఇది గమనించబడింది. ఒక అధ్యయనం ప్రకారం, పసుపు కళ్ల జంకోస్ మరణం వాటి మొదటి సంవత్సరంలో అత్యధికంగా ఉంది.10

వాస్తవానికి, ఈ అధ్యయనాలు అడవి జంతువుల జనాభాలో వయోజన మరణాలు మరియు శిశువుల గురించి కొన్ని కేసులకు మాత్రమే వివరాలను అందిస్తాయి. అడవి జంతువుల సమస్యపై మన విశ్లేషణ ప్రధానమైన పునరుత్పత్తి వ్యూహాల వల్ల సంభవించే అకాల మరణాల సంఖ్య మరియు బాధాకరంగా లేదా భయంకరంగా వుండే మరణాలపై ఆధారపడి ఉంటుంది, ఈ సమస్యను ఉదహరించడానికి కేస్ స్టడీస్ ఉపయోగపడతాయి.


తరువాత చదవవలసినవి

Barbault, R. & Mou, Y. P. (1998) “Population dynamics of the common wall lizard, Podarcis muralis, insouthwestern France”, Herpetologica, 44, pp. 38-47.

Bjørkvoll, E.; Grøtan, V.; Aanes, S.; Sæther, B. E.; Engen, S. & Aanes, R. (2012) “Stochastic population dynamics and life-history variation in marine fish species”, The American Naturalist, 180, pp. 372-387 [accessed on 25 November 2019].

Boyce, M. S. (1984) “Restitution of r- and K–selection as a model of density-dependent natural selection”, Annual Review of Ecology and Systematics, 15, pp. 427-447 [accessed on 15 February 2014].

Clarke, M. & Ng, Y.-K. (2006) “Population dynamics and animal welfare: Issues raised by the culling of kangaroos in Puckapunyal”, Social Choice and Welfare, 27, pp. 407-422.

Cody, M. (1966) “A general theory of clutch size”, Evolution, 20, pp. 174-184 [accessed on 13 March 2014].

Coulson, T.; Tuljapurkar, S. & Childs, D. Z. (2010) “Using evolutionary demography to link life history theory, quantitative genetics and population ecology”, Journal of Animal Ecology, 79, pp. 1226-1240 [accessed on 14 October 2019].

Dawkins, R. (1995) “God’s utility function”, Scientific American, 273, pp. 80-85.

Dempster, J. (2012) Animal population ecology, Amsterdam: Elsevier.

Horta, O. (2010) “Debunking the idyllic view of natural processes: Population dynamics and suffering in the wild”, Télos, 17, pp. 73-88 [accessed on 13 January 2013].

Horta, O. (2015) “The problem of evil in nature: Evolutionary bases of the prevalence of disvalue”, Relations: Beyond Anthropocentrism, 3, pp. 17-32 [accessed on 6 November 2015].

Jenouvrier, S.; Péron, C. & Weimerskirch, H. (2015) “Extreme climate events and individual heterogeneity shape life‐history traits and population dynamics”, Ecological Monographs, 85, pp. 605-624.

Leopold, B. D. (2018) Theory of wildlife population ecology, Long Grove: Waveland.

Lomnicki, A. (2018) “Population ecology from the individual perspective”, in DeAngelis, D. L. & Gross, L. J. (eds.) Individual-based models and approaches in ecology, New York: Chapman and Hall, pp. 3-17.

Murray, B. G., Jr. (2013) Population dynamics: Alternative models, Amsterdam: Elsevier.

Ng, Y.-K. (1995) “Towards welfare biology: Evolutionary economics of animal consciousness and suffering”, Biology and Philosophy, 10, pp. 255-285.

Parry, G. D. (1981) “The meanings of r- and K- selection”, Oecologia, 48, pp. 260-264 [accessed on 15 February 2013].

Phillips, B. L.; Brown, G. P. & Shine, R. (2010) “Life‐history evolution in range‐shifting populations”, Ecology, 91, pp. 1617-1627.

Pianka, E. R. (1970) “On r- and K-selection”, The American Naturalist, 104, pp. 592-597 [accessed on 20 February 2013].

Pianka, E. R. (1972) “r and K selection or b and d selection?”, The American Naturalist, 106, pp. 581-588 [accessed on 11 December 2013].

Reznick, D.; Bryant, M. J. & Bashey, F. (2002) “r-and K-selection revisited: The role of population regulation in life-history evolution”, Ecology, 83, pp. 1509-1520.

Rockwood, L. L. (2015 [2006]) Introduction to population ecology, 2nd ed., Hoboken: Wiley-Blackwell.

Roff, D. A. (1992) Evolution of life histories: Theory and analysis, Dordrecht: Springer.

Rolston, H., III (1992) “Disvalues in nature”, The Monist, 75, pp. 250-278.

Royama, T. (2012) Analytical population dynamics, Dordrecht: Springer.

Sæther, B. E.; Coulson, T.; Grøtan, V.; Engen, S.; Altwegg, R.; Armitage, K. B.; Barbraud, C.; Becker, P. H.; Blumstein, D. T.; Dobson, F. S. & Festa-Bianchet, M. (2013) “How life history influences population dynamics in fluctuating environments”, The American Naturalist, 182, pp. 743-759 [accessed on 11 July 2019].

Sagoff, M. (1984) “Animal liberation and environmental ethics: Bad marriage, quick divorce”, Osgoode Hall Law Journal, 22, pp. 297-307 [accessed on 12 January 2016].

Schaffer, W. M. (1974) “Selection for optimal life histories: The effects of age structure”, Ecology, 55, pp. 291-303.

Schmickl, T. & Karsai, I. (2010) “The interplay of sex ratio, male success and density-independent mortality affects population dynamics”, Ecological Modelling, 221, pp. 1089-1097.

Stearns, S. C. (1976) “Life history tactics: A review of the ideas”, Quarterly Review of Biology, 51, pp. 3-47.

Stearns, S. C. (1992) The evolution of life histories, Oxford: Oxford University Press.

Tomasik, B. (2013) “Speculations on population dynamics of bug suffering”, Essays on Reducing Suffering, Jun 11 [accessed on 13 April 2019].

Tomasik, B. (2015a) “The importance of wild-animal suffering”, Relations: Beyond Anthropocentrism, 3, pp. 133-152 [accessed on 20 November 2015].

Tomasik, B. (2015b) “Estimating aggregate wild-animal suffering from reproductive age and births per female”, Essays on Reducing Suffering, Nov 28 [accessed on 5 July 2019].

Tuljapurkar, S. (2013) Population dynamics in variable environments, Dordrecht: Springer.

Vandermeer, J. H. & Goldberg, D. E. (2013 [2003]) Population ecology: First principles, 2nd ed., Princeton: Princeton University Press.


Notes

1 Rastogi, R. K.; Izzo-Vitiello, I.; Meglio, M.; Matteo, L.; Franzese, R.; Costanzo, M. G.; Minucci, S.; Iela, L. & Chieffi, G. (1983) “Ovarian activity and reproduction in the frog, Rana esculenta”, Journal of Zoology, 200, pp. 233-247.

2 Zug, G. R. (1993) Herpetology: An introductory biology of amphibians and reptiles, San Diego: Academic Press. Junk, W. J. (1997) The Central Amazon floodplain: Ecology of a pulsing system. Berlin: Springer. Tyler, M. J. (1998) Australian frogs, London: Penguin.

3 Baum, E. T. & Meister, A. L. (1971) “Fecundity of Atlantic Salmon (Salmo salar) from two Maine rivers”, Journal of the Fisheries Research Board of Canada, 28, pp. 764-767. Hapgood, F. (1979) Why males exist, an inquiry into the evolution of sex, New York: Morrow. Hinckley, S. (1987) “The reproductive biology of walleye pollock, Theragra chalcogramma, in the Bering Sea, with reference to spawing stock structure”, Fishery Bulletin, 85, pp. 481-498. Boyle, P. & Rodhouse, P. (2005) Cephalopods: Ecology and fisheries, Oxford: Blackwell. Kozák, P.; Buřič, M. & Policar, T. (2006) “ The fecundity, time of egg development and juvenile production in spiny-cheek crayfish (Orconectes limosus) under controlled conditions ”, Bulletin français de la pêche et de la disciculture, 380-381, pp. 1171-1182 [accessed on 14 November 2019]

4 Brueland, H. (1995) “Highest lifetime fecundity”, in Walker, T. J. (ed.) University of Florida book of insect records, Gainesville: University of Florida, pp. 41-43 [accessed on 16 November 2019].

5 Overall, the distinction between these two strategies of emphasis on survival versus maximal reproduction has traditionally been referred to as K-selection and r-selection, although these terms are not used that much today. The reason for this terminology of K-selection and r-selection is that in the common equations used to estimate how populations vary through time, the variable referring to the number of offspring is usually named “r,” while the variable that refers to the carrying capacity of the environment, that is, how many individuals can survive in the ecosystem, is usually named “K”. Accordingly, “r” stands for “rate”, while “K” stands for the German word “Kapazität” (capacity). In a simple form, the equation can be put thus: dN/dt=rN (1- N/K), where N stands for the initial number of individuals of the population and t stands for the time at which we measure how the population varies. Verhulst, P.-F. (1838) “ Notice sur la loi que la population poursuit dans son accroissement ”, Correspondance mathématique et physique, 10, pp. 113-121.

One reason why these terms are no longer used much is because they are associated with a wider theory that made other claims concerning how the lives of the animals classified as K-strategists and r-strategists are, especially concerning their life histories. According to this wider theory, r-strategists would tend to live short lives, be generalists, have small sizes, reproduce at an early age, prevail in unstable ecosystems, and have density-independent survival rates, among other features; while K-strategists would tend to live long lives, be specialists, have large sizes, reproduce at an older age, prevail in stable ecosystems, and have density-dependent mortality rates. There is contradictory evidence to some of the claims of the theory.

6 Hurtado-Parrado, C. (2010) “Neuronal mechanisms of learning in teleost fish”, Universitas Psychologica, 9, pp. 663-678 [accessed on 13 May 2019]. Lopez-Luna, J.; Al-Jubouri, Q.; Al-Nuaimy, W. & Sneddon, L. U. (2017a) “Reduction in activity by noxious chemical stimulation is ameliorated by immersion in analgesic drugs in zebrafish”, Journal of Experimental Biology, 220, pp. 1451-1458 [accessed on 19 August 2019]. Lopez-Luna, J.; Al-Jubouri, Q.; Al-Nuaimy, W. & Sneddon, L. U. (2017b) “Impact of stress, fear and anxiety on the nociceptive responses of larval zebrafish”, PLOS ONE, 12 (8) [accessed on 14 October 2019]. Lopez-Luna, J.; Al-Jubouri, Q.; Al-Nuaimy, W. & Sneddon, L. U. (2017c) “Impact of analgesic drugs on the behavioural responses of larval zebrafish to potentially noxious temperatures”, Applied Animal Behaviour Science, 188, pp. 97-105. Lopez-Luna, J.; Canty, M. N.; Al-Jubouri, Q.; Al-Nuaimy, W. & Sneddon, L. U. (2017) “Behavioural responses of fish larvae modulated by analgesic drugs after a stress exposure”, Applied Animal Behaviour Science, 195, pp. 115-120.

7 The annual survival rate for deers under 1 year old was 0.31, for females between 1 and 2 years old it was 0.80, for males between 1 and 2 years old it was 0.41, for females older than 2 years it was 0.79, and for males over 2 years it was 0.47. Nelson, M. E. & Mech, L. D. (1986) “Mortality of white-tailed deer in Northeastern Minnesota”, Journal of Wildlife Management, 50, pp. 691-698.

8 Wolfe, M. L. (1977) “Mortality patterns in the Isle Royale moose population”, American Midland Naturalist, 97, pp. 267-279 [accessed on 31 May 2014].

9 Clutton-Brock, T. H.; Price, O. F.; Albon, S. D. & Jewell, P. A. (1992) “Early development and population fluctuations in Soay sheep”, Journal of Animal Ecology, 61, pp. 381-396 [accessed on 12 May 2014]. While there may be more adults than lambs and yearlings, the findings of this study are incongruent with the widely held belief that animals in the wild are generally old and sick when they die.

10 Sullivan, K. A. (1989) “Predation and starvation: Age-specific mortality in juvenile juncos (Junco phaenotus)”, Journal of Animal Ecology, 58, pp. 275-286 [accessed on 29 May 2014].