అడవి జంతువులకు కూడా పెంపుడు జంతువులు మరియు మానవుల లాగా హాని కలిగించావచ్చా?

అడవి జంతువులకు కూడా పెంపుడు జంతువులు మరియు మానవుల లాగా హాని కలిగించావచ్చా?

చాలా మంది మనుషులకు అడవి జంతువుల పట్ల ఆకర్షనీయమైన అభిప్రాయం వుంది; వాళ్ళ అభిప్రాయం ప్రకారం అడవి జంతువులు వాటి పరిసరాల వల్ల రాటుదేలాయి అని వాటికి నొప్పి కలగదని, కనీసం మనుషులకు, పెంపుడు జంతువులకు కలిగే స్థాయిలో ఉండదని వాళ్ళు అభిప్రాయపడతారు.

మరొక అభిప్రాయం ప్రకారం, అడవి జంతులు మనుషులు మరియు పెంపుడు జంతువుల కంటే వేరుగా వుంటాయి, అవి బాధను అనుభవించినప్పుడు, ఇంకా ఇతర కష్ట పరిస్థితులలో అవి సహాయాన్ని పొందాలి అని కోరుకోవు.

ఈ అభిప్రాయలు కేవలం అవాస్తవం. మనుషులు మరియు పెంపుడు జంతువులు స్పృహ కలిగి వుంటాయి అని నమ్మడానికి ఆధారమైన కారణాలు అడవిలో నివసించే జంతువులకు కూడా వర్తిస్తాయి. జంతువులకు పలు రకాలుగా కలిగే హాని, మనుషుల వల్ల కలిగే హానికి సంబంధం లేకుండా వుంటుంది.

అడవిలో జంతువులు కూడా పెంపుడు జంతువుల లాగే బాధపదతాయి

చాలా అడవి జంతువులు మన నుంచి ఎక్కువ వ్యత్యాసం లేని నాడీ వ్యవస్థ కలిగి వుంటాయి. వాస్తవానికి, చాలా వరకు మనుషులు స్పృహ కలిగి వుంటాయి అని పరిగణించే వాటి నాడీ వ్యవస్థతో సారుప్యత కలిగి వుంటాయి. తోడేళ్ళు మరియు కుక్కలు, అడవి పిల్లులు మరియు పెంపుడు పిల్లులు, అడవి పక్షులు మరియు కోళ్ళు, లేదా అడవి పందులు మరియు మామూలు పందులు మధ్య గల కనిష్ట వ్యత్యాసాన్ని పరిగణించండి. వాటిలో కొన్ని మాత్రమే భావనలు కలిగి ఉంటాయని లేదా కొన్ని మిగిలిన వాటికన్నా తక్కువ బాధపడతాయని నమ్మడం చాలా కష్టం. కేవలం వాటిలో కొన్ని మచ్చిక చేసుకోబడ్డ కారణంగా వాటిలో స్పందించే సామర్ధ్యం వేరుగా వుంటుంది అని అర్ధం కాదు. భావనలు గల జంతువులు అనుభూతి చెందే మరియు బాధపడే సామర్ధ్యం వాటి శరీర ధర్మం వల్ల కలిగి వుంటాయి కానీ, వాటి పరిస్థితుల వల్లో, మనుషులతో వుండే సామీప్యం వల్లో లేక మనుషులు వాటిని ఉపయోగించే విధానం వల్లో కాదు.

ఏదేమైనా, నిరంతరంగా వుండే గాయాలు, ఆకలి, నొప్పి తాలుక భయాలు అడవి జంతువులను ఈ హాని విషయం లో మనుషల కన్నా, పెంపుడు జంతువులు కన్నా తక్కువ సున్నితంగా మారుస్తాయని భావించే అవకాసం వుంది. అయినప్పటికీ, ఈ విషయాన్నీ సమర్ధించడానికి చాల తక్కువ ఆధారాలున్నాయి. అవి ఎదుర్కునే శారీరక హనితో పాటు, అడవిలో జీవించడం ఇంకా ఆ వాతావరణం వల్ల తరచుగా ఎదుర్కునే ప్రమాదాలకు ప్రతిస్పందించడం కోసం అవి అప్రమత్తంగా వుండాలి. ఈ బెదిరింపుల సంఖ్య ఇంకా వాటి తీవ్రతను చూస్తే, చాలా అడవి జంతువులు వాటి జీవితాంతం ఒక నిర్దిష్టమైన ఒత్తిడిని అనుభవిస్తుంటాయి.1 వాటిని తినే జీవుల భయం దీనికి ఒక ప్రధాన కారణం.2 సమాజంలో వుండే చాలా జంతువులు వాటి కుటుంబ సభ్యులు మరియు ఇతరులు మరణించినప్పుడు బాధని అనుభవిస్తాయి, మరియు అడవిలో వుండే జంతువులు తమ సొంత భద్రతను కాపాడుకోవడానికి వాటి పరిసరాల పట్ల నిరంతరం అప్రమత్తంగా వుండాలి.3 అడవిలో వుండే అన్ని జంతువులు ఈ పరిస్థితుల వల్ల తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించకపోవచ్చు, కానీ ఇతరులకు ఇది ఒక ముఖ్యమైన అంశం.4

కొన్ని జంతువులు గాయాలు, నీరసం, ఆకలి, ఇతర జీవులు తినడం వల్ల బాల్య దశలోనే మరణిస్తాయి.5 మానవులు మరియు చాలా పెంపుడు జంతువులు లాగా, ఈ జంతువులలో కొన్ని తక్కువ సంఖ్యలో సంతానానికి జన్మనిస్తాయి. అయినప్పటికీ, చాలా జంతువులు ఎక్కువ సంఖ్యలో సంతానాన్ని కలిగి వుంటాయి, మరియు వాటిలో చాలా వరకు చిన్న వయస్సులోనే మరణిస్తాయి. ఈ ప్రక్రియలో అవి అనుభవించే బాధలతో పాటు, మరణం ఈ జంతువులకు హాని కలిగిస్తుంది ఎందుకంటే ఈ జంతువులు భవిష్యత్తులో సానుకూల జీవిత అనుభవాలను కోల్పోతాయి.

ఈ పరిశీలనల ప్రకారం, అడవి జంతువులకు హాని జరగలేదనే వాదన జీవశాస్త్రం లేదా శరీరశాస్త్ర వాస్తవాలకు అనుగుణంగా లేదు.

దీన్ని బట్టి సహజంగా జరిగే హాని, ఉద్దేశపూర్వకమైన హాని కంటే సరైనదేమి కాదని మనం అర్థం చేసుకోవచ్చు

ప్రకృతిలో నివసించే జంతువులకు సహాయం చేయడాన్ని కొంతమంది వ్యతిరేకిస్తారు, ఎందుకంటే వారు ఆ జంతువుల బాధలను అడవిలో సహజమైన భాగంగా భావిస్తారు. ఈ ఆలోచనా విధానం ప్రకృతి కి విజ్ఞప్తి చేయడం అనే అపప్రధ పై అధారపడి వుంటుంది, అది సహజమైనది కాబట్టి మంచిదని, లేదా మనం తొలగించడానికి ప్రయత్నించాకూడదని భావిస్తారు. సహజమైనది అయినంత మాత్రాన బాధ మంచిది అని మనం నిజంగా అనుకుంటామా? మనుషులకు కలిగే బాధను మనం ఈ విధంగా పరిగణించము. ఆ బాధ అనుభవించే వ్యక్తికి కలిగే హాని గురించే మనం ఆలోచిస్తాం.

కొంతమంది అడవిలో జంతువులకు సహాయం చేయడాన్ని వ్యతిరేకిస్తారు, ఎందుకంటే వాళ్ళు పర్యావరణ వ్యవస్థను పట్టించుకోరు. వ్యక్తిగతమైన బాధలు పర్యావరణ వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి దోహదం చేస్తాయని వాళ్ళు వాదించవచ్చు. స్పష్టంగా చెప్పాలంటే, పర్యావరణ వ్యవస్థ వంటివి మార్చవచ్చు లేదా దెబ్బతినవచ్చు కానీ, వాస్తవానికి ఇది ప్రయోజనాన్ని లేదా హానిని కలిగించదు. సంబంధిత వాదనల ప్రకారం, హాని లేదా ప్రయోజనం పొందేటప్పుడు ఆ వ్యక్తి పర్యావరణ వ్యవస్థలో వున్నాడా అనేది నిర్ణయించే విషయం అవుతుంది.6

చాలా అడవి జంతువులు నివసిస్తున్న పరిస్థితులలోనే మనుషులు కూడా జీవిస్తూ వుంటే మనం ఇంత నిర్లక్ష్యాన్ని చూపించం. సహజ సిద్దమైన విపత్కర పరిస్థితులలో ( ఉదా., కరువు, వ్యాధి) అవి పర్యావరణ వ్యవస్థ సమగ్రతకు దోహధపడతయా అనే దానితో సంబంధం లేకుండా సహాయం పొందాలని మనుషులు నమ్ముతారు. నైతికతను చూపడానికి జాతులను సరిహద్దుగా పరిగణించడానికి సరైన కారణాలు లేవు కాబట్టి అడవి జంతువులకు సహాయం చేసేటప్పుడు మనకు భిన్నమైన వైఖరి ఉండకూడదు.

మనం నివారించదగిన హానిని నిష్పాక్షికంగా పరిగణించినప్పుడు, పెంపుడు జంతువులు లేదా మానవులు వంటి నిర్దిష్ట జంతువులకు కొన్ని రకాలకులుగా సంభవించే హానిని మాత్రమే వ్యతిరేకించడంలో అర్ధం లేదు. అయినప్పటికీ, జంతువుల దోపిడీని వ్యతిరేకించే చాలా మంది ప్రజలు అడవి జంతువులకు ప్రకృతి వల్ల కలిగే హానిని వ్యతిరేకించరు. ఈ అభిప్రాయం ప్రకారం, ఇక్కడ సమస్య జరిగిన హాని కాదు, అది జరిగే విధానం. ఇది సహజంగా జరిగితే, అందులో చెడు లేదా అంగీకరించకూడనిది ఏమి ఉండదు కానీ, ఒకవేళ అది మనుషుల కారణంగా జరిగితే మాత్రం అది చాల చెడు, ఇంక దానిని అంగీకరించలేం.

జంతువులకు సహజంగా హాని జరుగుతుంది కాబట్టి వాటికి ఉద్దేశపూర్వకంగా హాని చేయడం ఆమోదించదగినది అని మరికొందరి వాదన. ఇతర జంతువులు అడవిలో బాధలు పడతాయి కాబట్టి, జంతువులను దోపిడీ చేయడం సరైనదే అని వారి అభిప్రాయం. అయినప్పటికీ వారు మనుషుల విషయంలో ఇదే రకంగా వాదించరు.

అయినప్పటికీ, బాధ బాధే, ఆనందాన్ని కోల్పోవడం కోల్పోవడమే, అది ఏ విధంగాఎవరిని ప్రభావితం చేస్తుంది అనే దానితో సంబంధం ఉండదు.

అడవిలో జీవించడం అంటే బాగా జీవించడం కాదు

జంతువుల దోపిడీ వల్ల కలిగే భయంకరమైన హాని కారణంగా, అవి బందికానాలో లేనప్పుడే మంచి పరిస్థితులలో వున్నాయి అని మనం అనుకోవచ్చు. జంతువులు ప్రకృతిలో సంతోషకరమైన జీవితాలను కలిగి ఉన్నాయని చాలా మంది నమ్ముతారు ఎందుకంటే అవి నచ్చినది చేయగల స్వేచ్ఛ కలిగి ఉంటాయి.7 కానీ స్వేచ్ఛ స్వయంగా మంచి జీవితాన్ని పొందదు.

స్వేచ్ఛ అంటే ఒక వ్యక్తి ఏదో చేయటానికి బలవంతం చేయబడలేదని కాదు అని సిద్దాంత కర్తలు తరచుగా చెప్తుంటారు. బదులుగా, స్వేచ్ఛ అంటే ఒకరు జీవించాలనుకునే విధానానికి అనుగుణంగా, ఒకరు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయగలగడం. అడవిలో నివసించే చాలా జంతువులు ఈ విషయాలలో స్వేచ్ఛగా లేవు, కాబట్టి వాటి స్వేచ్ఛ పరిమితమైనది.

ఒక పేద పిల్లవాడి విషయాన్ని పరిగణించండి, వాడు ఆడుకోవడం మరియు బడికి వెళ్ళడం కంటే, ఆకలిని నివారించడానికి చాలా తక్కువ డబ్బు కోసం కఠినమైన పని చేయవలసిన పరిస్థితులను భరించాలి. అలాంటిపరిస్థితిలో వుండే పిల్లలు పని చేయకూడదు అని నిర్ణయించుకునే అవకాసం వుంది అనే కోణంలో వారు బానిసలుగా కనిపించకపోవచ్చు, కానీ దాని ప్రత్యామ్నాయం చావు అయితే, వారు స్వేచ్చగా వున్నారని మనం ఏ అర్ధవంతమైన కోణంలోనూ చెప్పలేం. ఇది తమ మనుగడకు నిరంతరం బెదిరింపులను ఎదుర్కోవాల్సిన మరియు వాటిపై నియంత్రణ లేని తీవ్రమైన హానిని అనుభవించవలసిన అడవి జంతువుల పరిస్థితి వంటిది. ప్రత్యామ్నాయం చావు అయినప్పుడు, కష్టతరమైన జీవితం అనేది భరించవలసినది, ఎంచుకున్నది కాదు, దీనిని వాస్తవికంగా స్వేచ్చగా పరిగణించలేం.

వాస్తవానికి, చాలా జంతువులు స్వేచ్ఛను ఆనందించలేవు ఎందుకంటే అవి ఉనికిలోకి వచ్చిన వెంటనే చనిపోతాయి. వాటి చావు పరిస్థితులు చాలా వరకు ఎంపిక కంటే అవకాశం మీద ఆధారపడి వుంటాయి, ఇంకా అవి సొంత స్వేచ్చను అనుభవించే అవకాసం చాలాతక్కువగా వుంటుంది అని వాటి చిన్న జీవితకాలం వల్ల తెలుస్తుంది.8 ఇది చాలా జంతువుల విధి, ఎందుకంటే వాటిలో అన్నీ దాదాపు పెద్ద సంఖ్యలో సంతానం కలిగి ఉన్నాయి, కొన్ని ఒకేసారి వందలు, వేల లేదా లక్షల గుడ్లు పెడతాయి. వాటి జనాభా స్థిరంగా ఉండాలంటే, వాటి సంతానంలో ఎక్కువ సంఖ్యలో మరణించాలి.

మన ఇతర అవసరాలు తీరినప్పుడు మరియు మన జీవిత గమనాన్ని నిర్ణయించడానికి మనకు అనేకంగా ఎంచుకునే అవకాశాలు అందుబాటులో ఉన్నప్పుడు స్వేచ్ఛ మానవులకు సంతృప్తికరంగా ఉంటుందని మనం భావించవచ్చు. అయితే, ఈ ఎంచుకునే అవకాసం లేకపోతే, మంచి జీవితాన్ని గడపడానికి స్వేచ్ఛ మాత్రమే సరిపోదని మనం భావించం.9 నిజానికి ఆనందం లేదా బాధను అనుభవించే మన సామర్థ్యం ముఖ్యమైనది అని కొందరు వాదించారు. మన ప్రాధాన్యతలను అడ్డుకోకుండా నేరవేర్చుకోవడమే మంచి జీవుతనికి లక్షణమని ఇంకొందరు వాదిస్తారు. స్వేఛ్చ అనేది మంచిది అయితే, అవసరమైన చాలా విషయాలలో ఇది ఒకటి అని, జీవితాన్ని ఆనందంగా గడపడానికి అంత కన్నా ముఖ్యమైన విషయాలు వున్నాయి అని మరికొందరి వాదన.

స్వేచ్ఛగా ఉండటం, మీకు మంచి అయిన కొన్ని విషయాలను సాధించడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ, మీ స్వేచ్ఛ మిమ్మల్ని నొప్పితో చనిపోవడానికి మాత్రమే అనుమతించినట్లయితే, అడవి జంతువుల విషయంలో లాగే, మీరు ఆ పరిస్థితిని మంచిగా భావించరు.

సామర్థ్యాలు మరియు ఒకరి స్వభావం యొక్క నెరవేర్పు

అడవిలో నివసించడం అనేది జంతువులకు వాటి నిజమైన స్వభావాలను పూర్తిగా వ్యక్తీకరించడానికి మరియు నెరవేర్చడానికి లేదా వాటి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి అనుమతిస్తుంది అని కొన్ని సందర్భాలలో చెప్పబడింది. ఏదేమైనా, ఇది జరగడానికి చాలా జంతువులు ఎక్కువ కాలం జీవించలేవు అని మనం భావించినప్పుడు, ప్రకృతిలో జీవించడం అలాంటి జీవితానికి హామీ ఇచ్చే అవకాశం లేదు. ఒకరి స్వభావానికి అనుగుణంగా జీవించడానికి ఒకరు సజీవంగా ఉండాలి. పుట్టిన వెంటనే మరణించే మానవ శిశువులను మనం పరిగణించినప్పుడు, వారి సామర్థ్యాలను పెంపొందించుకునే స్వేచ్ఛ లేదా వారి స్వభావాలను నెరవేర్చే స్వేచ్ఛ నుండి వారు ఎంతవరకు ప్రయోజనం పొందారో మనం మాట్లాడం. చాలా తక్కువ జీవితకాలం కేవలం గంటలు లేదా నిమిషాలు గడిపే వ్యక్తులు ఈ సామర్థ్యాలను ఆస్వాదించలేరు ఎందుకంటే వాటిని అభివృద్ధి చేయడానికి వారికి అవకాశం లేదు. కాబట్టి, వారి మరణాలు తరచూ భయంకరమైనవి మరియు బాధాకరమైనవి అనే వాస్తవాన్ని మనం పక్కన పెట్టి, వారు వారి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోగలరా లేదా వారి స్వభావాలను నెరవేర్చగలరా అనే దానిపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ, వారు అంత తక్కువ జీవితంలో ఆ పని చెయ్యలేరు అని స్పష్టంగా తెలుస్తుంది.10


Further readings

Alonso, W. J. & Schuck-Paim, C. (2017) “Life-fates: Meaningful categories to estimate animal suffering in the wild”, Animal Ethics [accessed on 10 November 2019]

Bovenkerk, B.; Stafleu, F.; Tramper, R.; Vorstenbosch, J. & Brom, F. W. A. (2003) “To act or not to act? Sheltering animals from the wild: A pluralistic account of a conflict between animal and environmental ethics”, Ethics, Place and Environment, 6, pp. 13-26.

Brennan, O. (2018) “‘Fit and happy’: How do we measure wild-animal suffering?”, Wild-Animal Suffering Research, 23 May [accessed on 14 May 2019].

Broom, D. M. (2014) Sentience and animal welfare, Wallingford: CABI.

Brown, J. (2006) “Comparative endocrinology of domestic and nondomestic felids”, Theriogenology, 66, pp. 25-36.

Clegg, I. L. K.; Delfour, F. (2018) “Can we assess marine mammal welfare in captivity and in the wild? Considering the example of bottlenose dolphins”, Aquatic Mammals, 44, pp. 181-200.

Clement, G. (2003) “The ethic of care and the problem of wild animals”, Between the Species, 13 (3) [accessed on 18 April 2011].

Darwin, C. (2018 [1860]) “Letter no. 2814”, Darwin Correspondence Project Darwin [accessed on 29 August 2018].

Davidow, B. (2013) “Why most people don’t care about wild-animal suffering”, Essays on Reducing Suffering, 11 Nov. [accessed on 26 September 2019].

Dawkins, R. (1995) “God’s utility function”, Scientific American, 273, pp. 80-85.

Faria, C. (2014) “Should we intervene in nature to help animals?”, Practical Ethics: Ethics in the News, December 21 [accessed on 18 October 2019].

Faria, C. (2015) “What (if anything) makes extinction bad?”, Practical Ethics: Ethics in the News, October 5 [accessed on 4 September 2019].

Faria, C. (2018) “The lions and the zebras: Towards a new ethics of environmental management in African National Parks”, in Ebert, Rainer & Roba, Anteneh (eds.) Africa and her animals, Pretoria: Unisa Press, pp. 325-342.

Feber, R. E.; Raebel, E. M.; D’cruze, N.; Macdonald, D. W. & Baker, S. E. (2016) “Some animals are more equal than others: Wild animal welfare in the media”, BioScience, 67, pp. 62-72 [accessed on 13 July 2019].

Fischer, B. (2018) “Individuals in the wild”, Animal Sentience, 23 [accessed on 29 October 2019].

Garmendia, G. & Woodhall, A. (eds.) (2016) Intervention or protest: Acting for nonhuman animals, Wilmington: Vernon.

Gould, S. J. (1982) “Nonmoral nature”, Natural History, 91 (2), pp. 19-26.

Hettinger, N. (1994) “Valuing predation in Rolston’s environmental ethics: Bambi lovers versus tree huggers”, Environmental Ethics, 16, pp. 1-10.

Hettinger, N. (2018) “Naturalness, wild-animal suffering, and Palmer on laissez-faire”, Les Ateliers de l’Éthique, 13 (1), pp. 65-84 [accessed on 2 December 2019].

Horta, O. (2015 [2011]) “The problem of evil in nature: Evolutionary bases of the prevalence of disvalue”, Relations: Beyond Anthropocentrism, 3, pp. 17-32 [accessed on 12 September 2019].

Horta, O. (2017) “Animal suffering in nature: The case for intervention”, Environmental Ethics, 39, pp. 261-279.

Horta, O. (2018) “Concern for wild animal suffering and environmental ethics: What are the limits of the disagreement?”, Les Ateliers de l’Éthique, 13 (1), pp. 85-100 [accessed on 4 December 2019].

Johannsen, K. (2017) “Animal rights and the problem of r-strategists”, Ethical Theory and Moral Practice, 20, pp. 333-345.

JWD Wildlife Welfare Supplement Editorial Board (2016) “Advances in animal welfare for free-living animals”, Journal of Wildlife Diseases, 52, pp. S4-S13.

Kirkwood, J. K. (2013) “Wild animal welfare”, Animal Welfare, 22, pp. 147-148.

Kirkwood, J. K. & Sainsbury, A. W. (1996) “Ethics of interventions for the welfare of free-living wild animals”, Animal Welfare, 5, pp. 235-243.

Kirkwood, J. K.; Sainsbury, A. W. & Bennett, P. M. (1994) “The welfare of free-living wild animals: Methods of assessment”, Animal Welfare, 3, pp. 257-273.

Knutsson, S. & Munthe, C. (2017) “A virtue of precaution regarding the moral status of animals with uncertain sentience”, Journal of Agricultural and Environmental Ethics, 30, pp. 213-224.

MacClellan, J. P. (2012) Minding nature: A defense of a sentiocentric approach to environmental ethics, PhD dissertation, Knoxville: University of Tennessee [accessed on 30 April 2020].

McLaren, G.; Bonacic, C. & Rowan, A. (2007) ”Animal welfare and conservation: measuring stress in the wild”, in Macdonald, D. W. & Willis, K. J. (eds.) (2013) Key topics in conservation biology, New York: Wiley-Blackwell, pp. 120-133.

Ng, Y.-K. (1995) “Towards welfare biology: Evolutionary economics of animal consciousness and suffering”, Biology and Philosophy, 10, pp. 255-285.

Nussbaum, M. C. (2006) Frontiers of justice: Disability, nationality, species membership, Cambridge: Harvard University Press.

Rolston, H., III (1992) “Disvalues in nature”, The Monist, 75, pp. 250-278.

Ryf, P. (2016) Environmental ethics: The case of wild animals, Basel: University of Basel.

Sagoff, M. (1984) “Animal liberation and environmental ethics: Bad marriage, quick divorce”, Osgoode Hall Law Journal, 22, pp. 297-307 [accessed on 14 July 2019]

Sittler-Adamczewski, T. M. (2016) “Consistent vegetarianism and the suffering of wild animals”, Journal of Practical Ethics, 4 (2), pp. 94-102 [accessed on 13 August 2019].

Soryl, A. A. (2019) Establishing the moral significance of wild animal welfare and considering practical methods of intervention, Master’s thesis, Amsterdam: University of Amsterdam.

Tomasik, B. (2013) “Intention-based moral reactions distort intuitions about wild animals”, Essays on Reducing Suffering, 4 Sept. [accessed on 14 March 2019].

Tomasik, B. (2015) “The importance of wild animal suffering”, Relations: Beyond Anthropocentrism, 3, pp. 133-152 [accessed on 2 July 2019].

Tomasik, B. (2016) “Is there net suffering in nature? A reply to Michael Plant”, Essays on Reducing Suffering, Nov 28 [accessed on 30 July 2019].

Torres, M. (2015) “The case for intervention in nature on behalf of animals: A critical review of the main arguments against intervention”, Relations: Beyond Anthropocentrism, 3, pp. 33-49 [accessed on 14 October 2019].


Notes

1 Boonstra, R. (2013) “Reality as the leading cause of stress: Rethinking the impact of chronic stress in nature”, Functional Ecology, 27, pp. 11-23 [accessed on 14 October 2019].

2 Laundré, J. W.; Hernández, L. & Altendorf, K. B. (2001) “Wolves, elk, and bison: Reestablishing the ‘landscape of fear’ in Yellowstone National Park, U.S.A.”, Canadian Journal of Zoology, 79, pp. 1401-1409. Horta, O. (2010) “The ethics of the ecology of fear against the nonspeciesist paradigm: A shift in the aims of intervention in nature”, Between the Species, 13 (10), pp. 163-187 [accessed on 12 June 2019]. Clinchy, M.; Sheriff, M. J. & Zanette, L. Y. (2013) “Predator-induced stress and the ecology of fear”, Functional Ecology, 27, pp. 56-65 [accessed on 25 November 2019]. Bleicher, S. S. (2017) “The landscape of fear conceptual framework: Definition and review of current applications and misuses”, PeerJ, 5 (9) [accessed on 2 August 2019]. Kohl, M. T.; Stahler, D. R.; Metz, M. C.; Forester, J. D.; Kauffman, M. J.; Varley, N.; White, P. J.; Smith, D. W. & MacNulty, D. R. (2018) “Diel predator activity drives a dynamic landscape of fear”, Ecological Monographs, 88, pp. 638-652 [accessed on 24 March 2019]. Zanette, L. Y.; Hobbs, E. C.; Witterick, L. E.; MacDougall-Shackleton, S.A. & Clinchy, M. (2019) “Predator-induced fear causes PTSD-like changes in the brains and behaviour of wild animals”, Scientific Reports, 9 [accessed on 13 December 2019].

3 Brakes P. (2019) “Sociality and wild animal welfare: Future directions”, Frontiers in Veterinary Science, 6 [accessed on 3 December 2019].

4 Rachels, J. (2009) “Vegetarianism”, Philosopher James Rachels (1941-2003) [accessed on 17 December 2012].

5 EFSA – European Food Safety Authority (2007 [2005]) “Opinion of the Scientific Panel on Animal Health and Welfare (AHAW) on a request from the Commission related to the aspects of the biology and welfare of animals used for experimental and other scientific purposes”, EFSA Journal, 292, pp. 1-46 [accessed on 14 June 2019].

6 See for instance Bernstein, M. H. (1998) On moral considerability: An essay on who morally matters, Oxford: Oxford University Press; (2015) The moral equality of humans and animals. Basingstone: Palgrave MacMillan.

7 It has also been argued that animals have the capacity to make their own choices and that, accordingly, the best thing for them is to let them form their own communities in the wild which would be like political entities we should respect. According to this, it would be right to aid them but only to help maintain these communities. This means that intervention is acceptable provided that it is not very significant, unless the animals’ community we are helping faces a very bad situation so it can no longer continue to exist as it did. This view has been presented in Donaldson, S. & Kymlicka, W. (2011) Zoopolis: A political theory of animal rights. Oxford: Oxford University Press.

Critics of this view have pointed out that most animals in the wild suffer so much that leaving them alone can be very bad for them, that the assumption that animals forms communities is only correct in the case of some social animals that are a minority in nature, and that we should care about all animals regardless of the group they belong to. See Horta, O. (2013) “Zoopolis, intervention and the state of nature”, Law, Ethics and Philosophy, 1, pp. 113-125 [accessed on 14 September 2019]; Cochrane, A. (2013) “Cosmozoopolis: The case against group-differentiated animal rights”, Law, Ethics and Philosophy, 1, pp. 127-141 [accessed on 14 September 2019]; Mannino, A. (2015) “Humanitarian intervention in nature: Crucial questions and probable answers”, Relations: Beyond Anthropocentrism, 3, pp. 109-120 [accessed on 14 September 2019].

8 See in particular Isaiah Berlin’s essay “Two concepts of liberty”, in Berlin, I. (1969) Four essays on liberty, London: Oxford University Press. See also: Gray, T. (1991) Freedom, London: Macmillan; Miller, D. (ed.) (1991) Liberty, Oxford: Oxford University Press.

9 This is different from the claim that freedom matters when it has to do with autonomy, which theorists such as Alasdair Cochrane claim only some animals, but not others, have. See Cochrane, A. (2011) Animal rights without liberation, New York: Columbia University Press.

10 See on this Nussbaum, M. C. (2006) Frontiers of justice: Disability, nationality, species membership, op. cit., ch. 6.