వీగనిసమ్

వీగనిసమ్

వీగనిసమ్ అనేది జంతువులకు హానిని తలపెట్టడానికి మరియు వాటిని పీడించడానికి వ్యతిరేకం. మనం ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను వాటికి హానిని చేకూరుస్తున్నాము. వేట మరియు చేపలు పట్టటం వంటివి ప్రత్యక్షం ఐతే, వినియోగదారులుగా ఇలాంటి చర్యలకు ప్రోత్సాహాన్ని ఇవ్వటం కూడా పరోక్షంగా వాటికి హానిని చేకూర్చటమే. మనం చాలా జంతువుల ప్రాణాల్ని వాటి ఉత్పత్తుల కోసం బలికోరుతున్నాము. అవి వాటి నుంచి లభ్యమయ్యే ఉత్పత్తుల కోసం కబేళాలలో కసాయుల చేత చంపబడుతున్నాయి. దీనికి కారణం జంతు ఉత్పత్తుల గిరాకీ రోజురోజుకూ పెరిగిపోవడమే. వీటిలో ముఖ్యమైనవి ఆహారపదార్థాలు.

వీగనిసమ్ అంటే ఇటువంటి ఆహారపదార్థాల వినియోగాన్ని వ్యతిరేకించతం. వాటిని భుజించకుండా ఉండటం. శాకాహారులు అన్ని ప్రాణులను సమానంగా చూస్తారే కాని ఉపయోగించుకొని వదిలేసే వస్తువులలా కాదు.

అనుసంధానం

చాలా మంది వీగనిసమ్ ని బలపరుస్తున్నారు. ఈ అమాయకపు మూగజీవాల ప్రాణాలను రక్షించటం రక్షించటం కోసం జంతు ఉత్పత్తుల ఉపయోగాన్ని ఆపేసి వాటి ప్రత్యామ్నాయాల వాడకం మొదలుపెట్టారు.

మన బిజీ జీవితాలలో మనం ఒకరి గురించి ఒకరం పట్టించుకోవడం మానేశాం. మనం కనుక జంతువుల స్థానంలో ఉంటే వాటిపట్ల జరిగే ఈ అన్యాయాన్ని హింసను మనం మన పై జరగనిస్తామా? మనం కనుక జంతువులమై పుడితే వాటిపట్ల హింసాత్మకంగా ప్రవర్తించే ఈ ప్రపంచాన్ని తప్పుపడతాం.

మనం జంతువుల పట్ల పక్షపాతబుద్ధి ని చూపిస్తున్నాం. కొన్ని జంతువులను , ఉదాహరణకు కుక్కలను మరియు పిల్లులను, కాపాడడానికి గొంతెత్తి అరుస్తున్నాం. కానీ వాటిలాగె చాలా జంతువులు హింసకు గురౌతున్నాయని గుర్తించలేక పోతున్నాం. ఇలాంటీ పక్షపాత బుద్ధి న్యాయమేనా?

ప్రత్యామ్నాయాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి

వీగనిసమ్  పెరుగుతున్న కొద్దీ జంతు ఉత్పత్త్తులకు ప్రత్యామ్నఆయాలు చాలా వచ్చాయి. ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన మొక్కల ఉత్పత్తుల వాడకం వీటికి బదులుగా పెరిగింది. ఇప్పుడు కిరాణా దుకాణాలలో మరియు సూపర్ మార్కెట్లలోను మొక్కల ఆధారిత ఉత్పత్తులు చాలా సులభంగా లభిస్తున్నాయి. జంతువుల నుంచి లభించే పాలకు ప్రత్యామ్నాయంగా సొయాబీన్, బియ్యం, ఓట్స్, మరియు జనపనార నుంచి లభించే పాలను ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈ పాలనుంచే పెరుగు చీజ్ మరియు ఐస్క్రీంల తయారీ మొదలుపెట్టారు.

చాలా విదేశీ రెస్టారెంట్లలో కూడా జంతు ఉత్పత్తులతో తయారు చేయబడని పదార్థాలు లభ్యమౌతున్నాయి. జంతు ఉత్పత్తులచే తయారు చేయబడే ఆహారపదార్థాలనే కాకుండా జంతువుల వెంట్రుకలు, చర్మం మరియు పక్షుల ఈకలతో చేయబడే వస్తువుల కొనుగోలును వాటి ప్రయోగాన్ని ఆపాలి. అలాంటి వస్తువులకు కూడా ప్రత్యామ్నాయాలు మనకు లభిస్తాయి. మన వినోదం కోసం జంతువులను హింసించటం, వేటాడి చంపటం వంటివి ఆపి సినిమాలకు వెళ్ళటం లేదా విహారయాత్రలకు వెళ్ళటం వంటివి అలవాటు చేసుకోవాలి.

మనమందరం చేయగలము

అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ కూడా వీగన్ ఆహారపు అలవాట్లను ఆరోగ్యకరమైనవిగా ధృవీకరించింది. చాలా మంది ఇటువంటి జీవన సరళికి అలవాటు పడ్డారు. మీరు కూడా ప్రయత్నిస్తే తప్పక ఈ జీవన సరళిని అలవాటు చేసుకోవచ్చు. అలా చెస్తే జంతువులను కాపాడి వాటికి మంచి మరియు సురక్షితమైన ప్రపంచాన్ని ఇచ్చిన వారవుతాము.