ఔచిత్య పరమైన వాదన (ఇతరులను నొప్పించకుండా వ్యవహరించే సామర్ధ్యం)

ఔచిత్య పరమైన వాదన (ఇతరులను నొప్పించకుండా వ్యవహరించే సామర్ధ్యం)

పూర్తిగా గౌరవించబడాలి అంటే మనవ జాతికి చెందిన వాళ్ళే అయ్యి వుండాలి అని వాదించే జనాలు కూడా వున్నారు. దీనితో పాటు, జంతువులకు పూర్తి నైతిక పరిశీలనను తిరస్కరించే వాళ్ళు కొన్ని సార్లు పర్యావరణ మరియు జాతుల సంరక్షణ, వ్యక్తుల శ్రేయస్సు కంటే ముఖ్యమైనది అంటూ పర్యావరణవేత్త దృక్కోణంలో మాట్లాడతారు.

వీటిలో ఏదీ సరైనది కాదు అని ఔచిత్య పరమైన వాదన సూచిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఒకరిని గౌరవించాల్సిన విషయంలో,ఆ వ్యక్తి పరిస్థితులకు సంబంధం లేకుండా మన చర్యలకు అనుకూలంగా లేక ప్రతికూలంగా ఎలా ప్రభావితం అవుతున్నాడో పరిగణించాలి. భావాలు తప్ప ఇతర లక్షణాలు మరియు పరిస్థితులను నిజానికి పట్టించుకోవలసిన అవసరం లేదు. ఈ వాదన ఎలా పని చేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ వాదనలో రెండు బాగాలు వుంటాయి.

మనం ఇతరులకు ఎలా ప్రయోజనం చేకూర్చవచ్చు మరియు హాని చేయవచ్చో ఆలోచించాలి

కొంత మంది వ్యక్తులను నైతికంగా పరిగణించడం అంటే, వారిని గౌరవించడం, దాని అర్ధం మనం ఎలా ప్రవర్తించాలో నిర్ణయించుకునేటప్పుడు ఆ వ్యక్తుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవడం మరియు  వారికి ఏది మంచిదో అది చేయడానికి ప్రయత్నించడం. కానీ మనం నిజంగా పరిగణలోకి తీసుకునేది ఏమిటి? ఇది కేవలం మన చర్యల ద్వారా వారిని ప్రభావితం చేసే మార్గం. ఉదాహరణకు, ఒక పుస్తకాన్ని చదవాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, విదేశాలలో నివసిస్తున్న వారి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలా అని మనం అడగము, ఎందుకంటే అది ఆ వ్యక్తిని ప్రభావితం చేయదు. కానీ మనం ఏదైనా చేస్తే వారికి హాని కలిగించే పరిస్థితిలో ఉన్నట్లయితే మనం కొంతమంది వ్యక్తులను పరిగణనలోకి తీసుకుంటాము మరియు అది చేయడం వల్ల వారికి హాని కలిగించవచ్చు కాబట్టి మనం ఖచ్చితంగా చేయకుండా ఉంటాము. ఉదాహరణకు, మనం మాంసం తినడానికి నిరాకరిస్తాం, ఎందుకంటే దాని కోసం ఒక జంతువు చంపబడుతుందని మనకు తెలుసు. మనం చర్య తీసుకోకుంటే వారికి హాని కలుగుతుందని తెలిసినట్లయితే మనం కొంతమంది వ్యక్తులను కూడా పరిశీలిస్తున్నాము మరియు వారికి హాని జరగకుండా కాపాడేందుకు మనం చర్య తీసుకుంటాము. మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు, ఎవరైనా నీటిలో మునిగిపోకుండా కాపాడినప్పుడు ఇది జరుగుతుంది.

వాస్తవానికి, ఖచ్చితంగా చెప్పాలంటే, ఈ సందర్భాలలో మనం చేసేది మన చర్యలు మరియు లోపాలను ఇతరులను సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఎలా ప్రభావితం చేస్తాయో పరిశీలించడం. మరోలా చెప్పాలంటే, మనం ఇతరులకు ఎలా ప్రయోజనం చేకూర్చవచ్చు లేదా వారికి హాని చేయవచ్చు అని పరిశీలించడం.

జాతివాదనికి మద్దతు ఇచ్చేవారు మనం మనుషులను మాత్రమే రక్షించాలని వాదిస్తారు, దానికి కారణం కేవలం వాళ్ళు మనుషులు కావడమే. అధికారం వున్న వాల్లని గౌరవించాలి అనే వాదన కూడా మనుషులు హాని లేదా ప్రయోజనాలు కలిగించగలరు అనే అంశంతో సంబంధం లేకుండా వారికీ ప్రత్యేక హక్కులు కల్పించడం కోసమే.

ఏది ఏమైనప్పటికీ, సంబంధిత అంశాల ఆధారంగా మన నైతిక నిర్ణయాలు తీసుకోవాలని మనం విశ్వసిస్తే ఏమి జరుగుతుందో ఔచిత్య పరమైన వాదన తెలియచేస్తుంది. అలాంటప్పుడు, ఒకరికి ఎలా ప్రయోజనం లేదా హాని కలుగుతుంది అనే దాని గురించి మనం ఆందోళన చెందుతున్నట్టు అయితే, మనం పరిగణనలోకి తీసుకునే వారు ప్రయోజనం లేదా హాని కలిగించే వారై ఉండాలి. మనం ఈ ఆలోచనను అంగీకరిస్తే, పైన పేర్కొన్న జాతుల సభ్యత్వం లేదా అధికారం వున్న వాళ్ళని గౌరవించడం వంటి షరతులను మనం తిరస్కరించాలి. దానికి బదులుగా, బాధలు మరియు సుఖాలను అనుభవించగలిగిన వాళ్ళే గౌరవించబడాలి అనే విషయాన్నీ సమర్దిస్తాం.

ఔచిత్య పరమైన వాదన రెండు భాగాలను కలిగి ఉంటుంది. ఇది వాదన యొక్క మొదటి భాగం, ఇది క్రింది నాలుగు దశలను కలిగి ఉన్నట్లు వ్యక్తపరచవచ్చు:

(1) అవి కలిగించే ప్రభావాలకు సంబంధించిన వాటి ఆధారంగా మనం మన నిర్ణయాలు తీసుకోవాలి.

(2) మనం ఒకరిని గౌరవించినప్పుడు, మన నిర్ణయాలు వారికి ఎలా హాని లేదా ప్రయోజనం చేకూరుస్తాయో పరిగణనలోకి తీసుకుంటాము మరియు వారికి ప్రయోజనం చేకూర్చడానికి, హాని చేయకుండా ప్రయత్నిస్తాం.

(3) ఒకరు ప్రయోజనం లేదా హానిని పొందడం అనేది వారు ప్రయోజనం లేదా హాని పొందగలిగే సామర్ధ్యం పై ఆధారపడి వుంటుంది.

(4) ప్రయోజనం లేదా హాని పొందగలిగే వారిని మనం గౌరవించాలి.

స్పృహ ఉన్న జీవులు మాత్రమే వారికి హాని జరుగుతుందా లేదా ప్రయోజనం కలుగుతుందా అనేది గుర్తించగలవు

హాని కలిగించే లేదా ప్రయోజనం పొందగల వారిని పరిగణనలోకి తీసుకోవాలని మనం అంగీకరించిన తర్వాత, తదుపరి దశ స్పష్టంగా కనిపిస్తుంది: ఒకరికి హాని లేదా ప్రయోజనం కలిగేలా చేసే లక్షణం లేదా పరిస్థితి ఏమిటో మనం కనుగొనాలి.

నిర్దిష్ట మేధో సామర్థ్యాలను కలిగి ఉన్నవారిని లేదా ఇతరులతో సంఘీభావంతో కూడిన ప్రత్యేక సంబంధాలను కలిగి ఉన్నవారిని మనం గౌరవించాలని జాతివాదం యొక్క చాలా మంది సమర్ధకులు పేర్కొన్నారు. కానీ ఈ పరిస్థితులు ఏవీ ఇతరులకు హాని కలిగించవచ్చని లేదా ప్రయోజనం పొందవచ్చని నిర్ణయించలేదు. వారు కేవలం ఒకరికి హాని కలిగించే లేదా ప్రయోజనం పొందగల కొన్ని మార్గాలను నిర్ణయిస్తారు. ఒక వ్యక్తికి నిర్దిష్ట మేధో సామర్థ్యాలు ఉంటే కొన్ని మార్గాల్లో హాని చేయవచ్చు. ఉదాహరణకు, ఆ సామర్థ్యాలు లేని ఇతరులు బాధపడని పరిస్థితుల్లో ఒకరికి భయాన్ని కలిగించవచ్చు, ఎందుకంటే వారు భయాన్ని అనుభవించడానికి కారణాన్ని అర్థం చేసుకోలేరు. లేదా, ఒకరికి నిర్దిష్ట బంధాలు ఉన్నట్లయితే, వారికి ఇతర మార్గాల్లో హాని కలిగించవచ్చు – ఉదాహరణకు, వారి స్నేహితులను చంపడం ద్వారా. కానీ ఒకరికి ఆ సామర్థ్యాలు లేదా సంబంధాలు లేకపోయినా ఇతర మార్గాల్లో కూడా హాని చేయవచ్చు. మనం హానికి బదులు ప్రయోజనాలను పరిగణలోకి తీసుకున్నా కుడా ఇలాగే జరుగుతుంది. మన ప్రత్యేక పరిస్థితులు లేద సామర్థ్యాలు మనకు హాని కలిగించే మరియు ప్రయోజనం పొందగల కొన్ని ప్రత్యేక మార్గాలను ప్రభావితం చేయవచ్చు, కానీ అవి మనం మొదటి స్థానంలో ప్రతికూలంగా మరియు సానుకూలంగా ప్రభావితం కాగలమో లేదో నిర్ణయించలేవు.

మనం ఒకరిని గౌరవించాలా లేదా అనేది వారి సామర్ధ్యాలు మరియు సంబంధాలపై ఆధారపడదు అని దీని ద్వారా తెలుస్తుంది. ప్రయోజనం పొందడం లేదా హాని చేయడం కోసం అవసరమైన పరిస్థితులు కానందున అవి సంబంధితమైనవి కావు.

అలాంటప్పుడు తప్పక తీర్చవలసిన షరతు ఏమిటి? దానికి సమాధానమివ్వడానికి, జీవితాన్ని మనకు ఏది మంచిగా లేదా చెడుగా చేస్తుందో ఆలోచించాలి. మన జీవితంలో, సంతోషం లేదా బాధతో కూడుకున్న క్షణాలు వంటి సానుకూల లేదా ప్రతికూల విషయాలు మనకు జరగవచ్చు. మనం వాటిని అనుభవించాలంటే, మనకు బాధ లేదా ఆనందాన్ని అనుభవించే సామర్థ్యం ఉండాలి. మనం ఈ అనుభవాలను పొందగలగడం మనం సజీవంగా ఉండటం వల్ల మాత్రమే కాదని గమనించండి. మనం కోలుకోలేని విధంగా అపస్మారక స్థితిలో ఉన్నామని, కానీ ఇంకా బ్రతికే ఉన్నామని అనుకుందాం. మనకు ఏది జరిగినా అది పూర్తిగా మనకు తెలియకుండానే గడిచిపోతుంది. కాబట్టి మనం ఇంకా బతికే ఉన్నామన్నది మనకు అప్రస్తుతం. మనకు ఏదైనా సానుకూల లేదా ప్రతికూల అనుభవం లేకపోతే, అది మనకు ఎప్పుడూ జరగనట్లే. మనకు ఏదైనా మంచి లేదా చెడు జరగాలంటే, మనం స్పృహలో ఉండాలి. అంటే, మనకు అనుకూలమైన లేదా ప్రతికూలమైన అనుభవాలు ఉండాలి.

ఒక వ్యక్తి అనేక రకాలుగా వివేకవంతుడు కావచ్చు. డాల్ఫిన్‌లు, తాబేళ్లు మరియు మానవులకు కలిగిన అనుభవాలు పూర్తిగా భిన్నంగా ఉండవచ్చు. అయినప్పటికీ వాటిలో ఒకేలా ఉన్న విషయం ఏమిటంటే, అనుభవాలు కలిగి ఉన్న జీవికి అవన్నీ సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ, స్పృహ లేని ఒక రాయి వంటి ఒక వస్తువు, సానుకూల మరియు ప్రతికూల విషయాలతో ఉనికిని కలిగి ఉండదు. ఈ కారణంగానే హాని లేదా ప్రయోజనం పొందాలంటే స్పృహలో ఉండాలి.

కాబట్టి, ఔచిత్య పరమైన వాదన యొక్క రెండవ భాగాన్ని ఇలా వ్యక్తపరచవచ్చు:

(4) ప్రయోజనం లేదా హాని పొందే వారిని మనం గౌరవించాలి.

(5) స్పృహలో వున్న జీవులే హానికి గురి అవుతాయి.

(6) బుద్ధి గల జీవులను మనం గౌరవించాలి.

ఇవన్నీ చాలా సులువుగా సంగ్రహించవచ్చు: ఒకరిని గౌరవించడం అంటే వారి శ్రేయస్సును పరిగణనలోకి తీసుకోవడం మరియు పరిగణనలోకి తీసుకోవడానికి, భావాలు ముఖ్యమైనవి. ఒకరి శ్రేయస్సును పరిగణనలోకి తీసుకోవాలా అనే ప్రశ్నకు ఏదైనా ఇతర షరతు అసంబద్ధం. ఇతర షరతులు వేరొకదానికి సంబంధించినవి కావచ్చు (ఉదాహరణకు, నిర్దిష్ట మేధో సామర్థ్యాలను కలిగి ఉండటం ఖచ్చితంగా విశ్వవిద్యాలయంలో చేరడానికి సంబంధితంగా కనిపిస్తుంది). కానీ శ్రేయస్సు గురించి ఆలోచించినప్పుడు పరిగణనలోకి తీసుకోవడానికి అవి సంబంధితమైనవి కావు.

వాస్తవానికి, సంబంధితమైన వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలనే వాదనను మనం తిరస్కరించవచ్చు. అంటే, అసంబద్ధమైన అంశాల ఆధారంగా మన నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ఇది ఆమోదయోగ్యంగా అనిపించదు. ఉదాహరణకు, నిరుద్యోగులకు డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇచ్చారని, డ్రైవింగ్ చేయగల వారికి నిరుద్యోగ భృతి ఇచ్చారని అనుకుందాం. అది అసంబద్ధం, ఎందుకంటే అసంబద్ధమైన అంశాల ఆధారంగా ఆ నిర్ణయాలు తీసుకోబడ్డాయి. గౌరవం కోసం భావాన్ని ప్రమాణంగా అంగీకరించే బదులు, మేధో సామర్థ్యాలు లేదా సంఘీభావ సంబంధాలు వంటి ఇతర ప్రమాణాలను మనం అంగీకరించినప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది.


తరువాత చదవదగినవి

Bernstein, M. H. (1998) On moral considerability: An essay on who morally matters, Oxford: Oxford University Press.

Bernstein, M. H. (2002) “Marginal cases and moral relevance”, Journal of Social Philosophy, 33, pp. 523-539.

Bernstein, M. H. (2004) “Neo-speciesism”, Journal of Social Philosophy, 35, pp. 380-390.

Comstock, G. (1992) “The moral irrelevance of autonomy”, Between the Species, 8, pp. 15-27.

Cushing, S. (2003) “Against ‘humanism’: Speciesism, personhood and preference”, Journal of Social Philosophy, 34, pp. 556-571.

DeGrazia, D. (1996) Taking animals seriously: Mental life and moral status, Cambridge: Cambridge University Press.

Ehnert, J. (2002) The argument from species overlap, ముఖ్యమైన పరికల్పన (వాదన), Blacksburg: Virginia Polytechnic Institute and State University [చూడబడిన తేదీ 23 ఆగస్టు 2018].

Hare, R. M. (1989) “Relevance”, లో Hare, R. M. Essays in ethical theory, Oxford: Oxford University Press, pp. 191-211.

Horta, O. (2010) “What is speciesism?”, Journal of Agricultural and Environmental Ethics, 23, pp. 243-266 [చూడబడిన తేదీ 30 మే 2013].

Horta, O. (2018) “Moral considerability and the argument from relevance”, Journal of Agricultural and Environmental Ethics, 31, pp. 369-388 [చూడబడిన తేదీ 14 జూలై 2018].

McMahan, J. (1996) “Cognitive disability, misfortune, and justice”, Philosophy and Public Affairs, 25, pp. 3-35.

Pluhar, E. B. (1988) “Is there a morally relevant difference between human and animal nonpersons?”, Journal of Agricultural and Environmental Ethics, 1, pp. 59-68.

Pluhar, E. B. (1995) Beyond prejudice: The moral significance of human and nonhuman animals, Durham: Duke University Press.

Robinson, W. S. (1997) “Some nonhuman animals can have pains in a morally relevant sense”, Biology and Philosophy, 12, pp. 51-71.

Ryder, R. D. (1975) Victims of science: The use of animals in research, London: Davis-Poynter.

Ryder, R. D. (1998) “Speciesism”, లో Bekoff, M. & Meaney, C. A. (eds.) Encyclopaedia of animal rights and animal welfare, Chicago: Fitzroy Dearborn, p. 320.

Sapontzis, S. F. (1987) Morals, reason, and animals, Philadelphia: Temple University Press.

Singer, P. (2009 [1975]) Animal liberation, reissue ed., New York: Harper Perennial Modern Classics.


గమనికలు

1 Diamond, C. (1991) “The importance of being human”, లో Cockburn, D. (ed.) Human beings, Cambridge: Royal Institute of Philosophy, pp. 35-62. Gaita, R. (2003) The philosophers dog: Friendships with animals, London: Routledge. Posner, R. A. (2004) “Animal rights: Legal, philosophical and pragmatical perspectives”, లో Sunstein, C. R. & Nussbaum, M. (eds.) Animal rights: Current debates and new directions, Oxford: Oxford University Press, pp. 51-77.

2 Narveson, J. (1999) Moral matters, Toronto: Broadview. Goldman, M. (2001) “A transcendental defense of speciesim”, Journal of Value Inquiry, 35, pp. 59-69.

3 Francis, L. P. & Norman, R. (1978) “Some animals are more equal than others”, Philosophy, 53, pp. 507-527. McCloskey, H. J. (1979) “Moral rights and animals”, Inquiry: An Interdisciplinary Journal of Philosophy, 22, pp. 23-54. Leahy, M. P. T. (1991) Against liberation: Putting animals in perspective, London: Routledge. Carruthers, P. (1992) The animals issue: Moral theory in practice, Cambridge: Cambridge University Press.

4 Becker, L. C. (1983) “The priority of human interests”, లో Miller, H. B. & Williams, W. H. (eds.) Ethics and animals, Clifton: Humana Press, pp. 225-242. Midgley, M. (1983) Animals and why they matter, Athens: University of Georgia Press. Callicott, J. B. (1989) In defense of the land ethic: Essays in environmental philosophy, Albany: State University of New York Press. Petrinovich, L. (1999) Darwinian dominion: Animal welfare and human interests, Cambridge: MIT Press.