జంతు లక్షణాలపై అధ్యయనం చేసే వాళ్ళ యొక్క ఆలోచన జంతువులపై తక్కువ దృష్టిని మాత్రమే ఆకర్శించింది. ఇది దురదృష్టకరం, నేడు ప్రపంచం సాటి జీవుల ప్రాణాలకు విలువ ఇవ్వ పోవడానికి ప్రధమ కారణం ఇదే. దీని కారణంగా, స్పృహనికి ఎలాంటి భౌతిక నిర్మాణాలు అవసరం, ఏ జీవులు స్పృహ గలవి మరియు జీవులకు ఎలాంటి ఆసక్తులు ఉండవచ్చు అనే అంశాలను అధ్యయనం చేయాలి.
ఈ సమస్యలను అర్థం చేసుకోవడానికి, పరిష్కరించాల్సిన అనేక ప్రశ్నలు ఉన్నాయి.
జంతువుల యొక్క భావాలు తెలుసుకోవాలంటే మనిషిలాగే జంతువులు కూడా నొప్పి ,బాధ,స్వేచ్ఛ , ఆనంధం వ్యక్తపరిచేజీవులుగా గుర్తించగలగాలి.అంతే కాకుండా ఏ జంతువుకు వేటిపై ఇష్టం ఉందో గ్రహిం చగలగాలి. ఆ విధంగా జంతువుల యొక్క భావలపై అధ్యయనం చేసే ప్రక్రియలో మనకి కాలిసిన సమాచారం పొందవచ్చు .
జంతువుల భావాన్ని తిరస్కరించే వారు కొన్నిసార్లు జంతువులు తెలివిగలవా అని నిరూపించలేమని పేర్కొన్నారు. కానీ అలాంటి అభిప్రాయాన్ని తిరస్కరించడానికి శక్తివంతమైన కారణాలు ఉన్నాయి.
ఒక జీవి స్పృహలో ఉందా లేదా అనే విషయాన్ని మనం పరిగణించవలసిన ప్రమాణాల ప్రకారం, తెలివి ఉన్న జంతువులు కేంద్రీకృత నాడీ వ్యవస్థలను కలిగి ఉన్నాయని నిర్ధారించడానికి కారణాలు ఉన్నాయి.
అనుభవాలను అనుభూతి చెందేందుకు అవసరమైన భౌతిక నిర్మాణాలు లేని జంతువులు ఉన్నాయి. వాటిలో నాడీ వ్యవస్థ లేనివి మరియు నాడీ వ్యవస్థలు కేంద్రీకృతం కానివి ఉన్నాయి.
భూమి మీద చాలా వరకు జీవులన్నీ అకశేరుకాలు. అకశేరుకాలు అనే పేరు అన్ని జాతులలో 99% విభిన్న మైన జంతువులు అన్నిటికి వర్తిస్తుంది.శరీర నిర్మాణ సంబంధమైన నిర్మాణాలలో ఇటు వంటి వైవిధ్యం అకశేరు కాలలో మనోభావాలను మూల్యాంకనం చేయడం సవాలుగా చేస్తుంది మరియు వాటి జాతుల సంఖ్య మరియు భిన్న మైన శరీర అకృతులు ఉండడం కారణంగా అధ్యయనం చాలా అవసరం.
ఈ వ్యాసం వివిధ అకశేరుకాల యొక్క నాడీ వ్యవస్థల యొక్క సంబంధిత లక్షణాలను వాటి శరీరధర్మ శాస్త్రానికి సంబంధించి, సరళీకృత దృష్టాంతాలతో పరిశీలిస్తుంది. ఈ జంతువులలోని భారీ వైవిధ్యాన్ని ప్రతిబింబించే విధంగా వాటిని నిర్దిష్టఫైలా లేదా అకశేరుకాల తరగతు ల ప్రకారం వర్గీకరించాము .
అనేక మానవులేతర జంతువులు బుద్ధి జీవులని మనం నిర్ధారించినప్పటికీ, అవి బాధపడే పరిస్థితులను మనం ఇంకా గుర్తించలేకపోవచ్చు. జంతువుల మనోభావాలు ఏ సందర్భాలలో ఉందో మరియు జంతువులు ఎప్పుడు బాధపడతాయో గుర్తించడంలో మాకు సహాయపడే అనేక సూచికలు ఉన్నాయి.