అడవి జంతువుల ఇబ్బందులు : ఒక పరిచయం

అడవి జంతువుల ఇబ్బందులు : ఒక పరిచయం

ఒక అడవి జంతువు గురించి ఒక క్షణం ఆలోచించండి. మీ ఆలోచనలో ఏ జంతువును చూసారు?

ఇది అడిగినప్పుడు, చాలా మంది జనాలు చూసేది ఆరోగ్యవంతమైన, ఎదిగిన, పెద్ద క్షీరదాలు (లేదా మరొక పెద్ద సకశేరుకం ( వెన్నెముక కలిగిన జంతువు) కావచ్చు), సింహం లేదా ఏనుగు లాంటివి. వాళ్ళు ఆలోచించేది ఆనందంగా వున్న జంతువులు, మనిషి వల్ల హాని పొందకుండా తమలో తాము ఆనందించేవి. అడవి జంతువుల పరిస్థితి గురించి నేటి ప్రబలమైన అభిప్రాయం ఇది.

అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు అడవి జంతువులను రకరకాలుగా రక్షించి సహాయం చేస్తున్నారు, అది మనం తరువాత చూస్తాం. లేదంటే ఈ జంతువులు చాలా బాధాకరమైన పరిస్థితిలోమరణిస్తాయి. అక్కడ జంతువులకు జీవితం అంత సులభంగా ఉండదు. అవి పుట్టిన క్షణం నుండి లేదా గుడ్లు పగలకొట్టుకొని బయటికి వచ్చినప్పటి నుంచి, అవి చాలా తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కోవాలి, ఇది వాటికి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది.

జంతువులకు ఇబ్బంది కలిగించే కారకాలు చాల వైవిధ్యంగా వుంటాయి. కొన్ని నేరుగా మనిషి చేసే పనుల వల్ల జరుగుతాయి. మిగతావి మనిషి చేసే పనుల యొక్క పరోక్ష ఫలితం వల్ల కావచ్చు, ప్రకృతి లోని పరిస్థితుల వల్ల కావచ్చు, లేదా రెండింటి సమ్మేళనం కావచ్చు. పాక్షికంగా లేదా పూర్తిగా సహజంగా వుండే కారకాలలో ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులు, ఆకలి మరియు పోషకాహారలోపం, దాహం, విపరీతమైన వ్యాధులూ, ప్రమాదాలు మరియు గాయాలు, ఇతర జంతువులతో విభేదాలు, ఆహరం కోసం ఇతర జంతువులపై ఆధారపడడం మరియు మానసిక ఒత్తిడి. ఇవి అసాధారణమైన పరిస్థితులు కావు, ఇంకా వాటి వల్ల జంతువులకు కలిగే హాని సామాన్యమైనది కాదు. ఆ హాని పెంపుడు జంతువులకు మరియు మనకు ఎంత బాధాకరంగా తీవ్రంగా ఉంటుందో వాటికి కూడా అదే స్థాయిలో వుంటుంది. నిజానికి, వాటి వల్ల, చాలా జంతువుల జీవితాలు ఆనందంతో కంటే ఎక్కువగా ఇబ్బందితో నిండి వున్నాయి.

ఉదాహరణకు,ఒక పక్షి పిల్ల తన గూడు నుండి కింద పడి ఇబ్బందిపడుతూ, నేలమీద రోజుల తరబడి ఆకలితో చస్తూ, చలికి ఇబ్బందిపడుతూ, ఇంకా కింద పడడం వల్ల కలిగిన గాయాల వల్ల ఇబ్బందిపడుతూ వుంటుంది. లేదా ఒక చేప పిల్ల ఆహారాన్ని వెతకలేక ఆకలితో అలమటిస్తూ వుంటుంది. పసి జంతువులలో ఈ పరిస్థితులు సాధారణం. ఇతర జంతువులు ఎక్కువ కాలం జీవించి యుక్తవయస్సు చేరుకోగలవు కాని సుధీర్గమైన నొప్పికి లోనవుతాయి లేదా చాలా ఇబ్బందులను భరించిన తరువాత చనిపోతాయి. నాసల్ బాట్ అనే వ్యాధి సంక్రమించి ఇబ్బందిపడే జింక దీనికి ఉదాహరణ. ఈ వ్యాధికి కారణం నాసిక రంద్రాల్లో పెరిగే పురుగు పిల్లలు, అవి ఎక్కువ సంఖ్యలో పెద్ద పరిమాణంలో పెరిగి ఆ జింకను ఉపిరి పీల్చుకోనివ్వకుండా చేసి మెల్లగా చనిపోయేలా చేస్తాయి.

అడవిలో వుండే జంతువులకోసం మనం చేయగలిగే సరైన పని వాటిని ఒంటరిగా వదిలేయడమే అనే ఆలోచన ప్రతిసారీ సరైనది కాదని ఇలాంటి ఉదాహరణలు తెలియజేస్తాయి. జంతువులకు సహాయం చేయడానికి మనం ఏమీ చేయలేని సందర్భాలు చాలా ఉన్నాయి, లేదా వాటికి సహాయం చేయడం వల్ల ఇతరులకు ఎక్కువ హాని కలిగించవచ్చు. కానీ, అనుకూలంగా వుండే జంతువుల కోసం ఘననీయమైన వ్యత్యాసాన్ని సృష్టించగల సందర్భాలు కూడా వున్నాయి. మనలాగే, జంతువులపై శ్రద్ధ చూపించే కొందరు వ్యక్తులు, ఇది ఎందుకు సమస్య అని ఆశ్చర్యపోవచ్చు, నేడు మనుషుల వల్ల జంతువులకి హాని చేసే అనేక మార్గాలు వున్నాయి, అవి బందిఖానాలో వుంచడం లేదా చేపలు పట్టడం ద్వారా అడవిలోనే హాని చేయడం. ఇతర కారణాల వల్ల ఇబ్బందిపడుతున్న జంతువుల గురించి ఆందోళన చెందడం అనేది ఈ ఆందోళనకి ఒక విస్తరణ మాత్రమే. మనుషుల వల్ల లేదా హానికరమైన వాతావరణ పరిస్థితుల వల్ల లేదా వ్యాధులు లాంటి ఇతర కారణాల వల్ల జంతువులన్నింటికీ హాని కలుగుతుందా అనే దానితో సంబంధం లేకుండా అన్ని జంతువులను చూసుకోవడంలో ఎలాంటి వైరుధ్యం లేదు. మనుషుల వల్ల హాని చేయబడ్డ జంతువుల పట్ల మాత్రమే శ్రద్ధ వహించి, మిగిలిన జంతువులను పట్టించుకోకపోవడంలో ఒక వైరుద్యం వుంది.

అడవి జంతువుల ఇబ్బందులు గురించి తెలుసు కోవడం ఎందుకు అంత ముఖ్యం?

అడవి జంతువుల ఇబ్బంది ప్రాధాన్యతను బాగా అర్థం చేసుకోవడానికి, పైన వివరించినట్లుగా అనేక జంతువులు ఇబ్బందులతో నిండిన జీవితాలను కలిగి ఉన్నాయని మనం తెలుసుకోవాలి. అటువంటి పరిస్థితులు మనం నమ్మే వాటికంటే చాల ఎక్కువ సంఖ్యలో వున్నాయి. జంతువుల జనాభా ఎలా అభివృద్ధి చెందుతుందో మరియు యుక్త వయసులో వాటి మరణాల స్థాయి ఎలా ఉందో పరిశీలించడం ద్వారా మనం దీనిని చూడవచ్చు. ఇది జీవశాస్త్రంలోని వివిధ రంగాల ద్వారా అధ్యయనం చేయబడుతుంది, జంతువుల జనాభాను మరియు జీవిత చరిత్రలను పరిశీలిస్తుంది.

రకరకాల జంతువులు అనుసరించే పునరుత్పత్తి వ్యూహం దీనిని నిర్ణయించే ముఖ్యమైన అంశం. ప్రకృతిలో, కొన్ని జంతువులు ఒకసారి కేవలం ఒక సంతానాన్ని మాత్రమే కనడం ద్వారా పునరుత్పత్తి చేస్తాయి. ఈ జంతువులు, వాటి సంతానానికి మనుగడ అవకాసాలను పెంచడానికి తల్లితండ్రుల సంరక్షణను అందిస్తాయి. ఏదేమైనా, చాలా పెద్ద సంఖ్యలో సంతానాన్ని ఉనికిలోకి తేసుకువచ్చేలా, చాల జంతువులు చాలా భిన్నమైన పునరుత్పత్తి వ్యూహాన్ని అనుసరిస్తాయి. ఈ జంతువుల జీవిత ప్రారంభంలో వాటి మనుగడ స్థాయి సాధారణంగా చాలా తక్కువగా వుంటుంది. జంతువులు తమ జీవితాల్లో ఒక్కసారి మాత్రమే పునరుత్పత్తి చేస్తే ఇంకా వాటి జనాభా స్థిరంగా ఉంటే, సగటున వాటి గుంపులో రెండు మాత్రమే యుక్తవయస్సు వరకు చేరుకుంటారు (అంటే, కేవలం ఒక శాతం). అవి అనేక సార్లు పునరుత్పత్తి చేస్తే, సగటు సంఖ్య తగ్గుతుంది.

ఈ జంతువులలో కొన్ని పరిపక్వ స్థితికి చేరుకోలేకపోయినా కొంతకాలం జీవించగలవు. కానీ చాలా సందర్భాలలో, అవి ఉనికిలోకి వచ్చిన కొంతకాలానికే చనిపోతాయి. వాటిలో కొన్ని ఎప్పటికీ భావాలు గల జీవులుగా ఎదగకపోవచ్చు. కానీ, వాటిలో చాల జీవులు ఎదుగుతాయి, ఇంకా అవి చాలా బాధాకరమైన స్థితిలో మరణిస్తాయి, కొన్నిసార్లు ఇంకా దారుణమైన స్థితిలో. అవి ఆకలితో చనిపోతాయి, బాధాకరమైన రీతిలో చంపబడతాయి లేదా చలి, వ్యాదుల వంటి ఇతర కారణాల వల్ల చనిపోతాయి. ఏదేమైనా, అవి చనిపోయినప్పుడు అవి చాలా చిన్నవి కాబట్టి, వాటికి ఎలాంటి ఆనందాలను పొందే అవకాశాలు ఉండకపోవచ్చు. అవి వాటి మరణం కంటే కొంచెం ఎక్కువ ఇబ్బందిని అనుభవిస్తాయి. ఈ కారణంగా, ఇబ్బంది వాటి జీవితాలలో సంతోషాన్ని మించిపోయింది. దురదృష్టవశాత్తు, ఉనికిలోకి వచ్చిన వాటిలో ఎక్కువ భాగం బహుశా ఇలాంటి జంతువులే. అడవి జంతువుల ఇబ్బంది గురించి తెలుసు కోవడం ఎంత అవసరమో ఈ కారణాలన్ని తెలుపుతున్నాయి.వీటిలో కొన్ని జంతువులకు సహాయపడే మార్గాలలో ఎందుకు ఎక్కువ వ్యత్యాసం వుందో కూడా ఇది సూచిస్తుంది. కిందివి దీనికి కొన్ని ఉదాహరణలు.

అడవి జంతువుల ఇబ్బందులకు కారణాలు మరియు జంతువులకు సహాయపడే మార్గాలు

అడవిలోని జంతువులు చాలా ఇబ్బందులకు గురవుతాయి మరియు అకాల మరణాలు చెందుతాయి, వాటికి కారణాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, అనేక రకాల వ్యాధులు, ఆకలి, పోషకాహారలోపం మరియు దాహం, మానసిక ఒత్తిడి, జంతువుల మధ్య విభేదాలు మరియు తీవ్ర గాయాలను కలిగించే ప్రమాదాలు. అయితే, చాలా సందర్భాలలో, ఇవి సహాయం పొందాయి. వీటికి చాలా ఉదాహరణలు వున్నాయి. సముద్ర తీరాలలో చిక్కుకున్న జంతువులను రక్షించడం, మంచు, బురద చెరువులు మరియు అనేక ఇతర పరిస్థితులలో చిక్కుకోవడం, అనారోగ్యంతో మరియు గాయపడిన జంతువులకు ఆశ్రయం ఇంకా సహాయం అందించడం మరియు ఆకలి ఇబ్బంది నుండి కాపాడడం వంటివి ఉన్నాయి. పెద్ద ఎత్తున, వ్యాక్సినేషన్ (టీకాలు వేయించడం) కార్యక్రమాలు భారీ సంఖ్యలో జంతువులను వ్యాధి కారణంగా ఇబ్బందిపడకుండా మరియు చనిపోకుండా కాపాడతాయి. జంతువులకు సహాయపడేందుకు కొత్త కార్యక్రమాలను అభివృద్ధి చేయవచ్చు. ఉదాహరణకు, పట్టణ, నగర లేదా పారిశ్రామిక ప్రాంతాల్లో నివసిస్తున్న అడవి జంతువుల పరిస్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో బాగా పర్యవేక్షించబడే కార్యక్రమాలు ప్రారంభించవచ్చు. ఈ కార్యక్రమాల నుండి మనం నేర్చుకున్న వాటిని వ్యవసాయ ప్రాంతాల్లో నివసించే జంతువుల కోసం అన్వయించవచ్చు, ఇంకా అడవి ప్రాంతాల్లో సహాయం అవసరమైన వాటికి సహాయం చేయవచ్చు. అలాగే, మనం ఇప్పుడు చేయలేని విధానాలను భవిష్యత్తులో మెరుగుపరచగలమని మనం గుర్తుంచుకోవాలి. అయితే, ఇది జరగాలంటే, జంతువుల పట్ల మనం నిర్లక్ష్యంగా కాకుండా వాటి ఇబ్బందిని చూసి ఆందోళన చెందేలా ఉండటం అవసరం.

జంతువులకు సహాయం చేయడానికి ప్రజలు ఎందుకు నిరాకరిస్తారు?

వారు అనుభూతి చెందుతూ, ఇబ్బందిపడుతూ ఉన్నప్పటికీ, కొందరు ప్రజలు జంతువులకు ఏమి జరుగుతుంది అనే దాని గురించి పట్టించుకోరు. ఇది జాతివాదం అని పిలవబడే వివక్ష యొక్క రూపాలలో ఒకటిగా కనిపిస్తుంది. అయితే, చాలా మంది ఇతరులు జంతువుల పట్ల శ్రద్ధ చూపిస్తారు, కానీ అడవి జంతువులకు ఏమి జరుగుతుందో వాళ్లకు తెలియదు. వాటికి ఎలాంటి సహాయం కావాలో మనం కొన్ని ఉదాహరణలు చూసాం. అడవి జంతువులకు మన సహాయం చాలా అవసరం అని చాలా మంది ఊహించరు. దీనిని వివరించడానికి కారణాలు ఉన్నాయి:

మొదటిది, ఈ జంతువుల జీవితాలు ఎలా ఉంటాయో చాలామందికి తెలియదు. ముఖ్యంగా, జంతువుల జనాభా గురించి వాళ్ళకు తెలియదు. అంతేకాక, తెలిసిన వాళ్ళు కూడా కొన్ని సార్లు జంతువుల ఇబ్బందిని అర్ధం చేసుకోవడంలో విఫలం అవుతారు.

రెండవది, ప్రకృతిలో జంతువుల జీవితాలు ఎలా ఉండాలో వుహించడంలో మనకి కొన్ని పక్షపాతాలు వున్నాయి. చాలా మంది అడవి జంతువుల గురించి ఆలోచించినప్పుడు, వారి మనస్సులోకి వచ్చేవి పెద్ద జంతువులు, ఎక్కువగా క్షీరదాలు లేదా పెద్ద పక్షులు దాదాపుగా సకశేరుకాలు(వెన్నెముక కలిగిన జీవులు). వారు బహుశా సింహాలు మరియు పులులు, జిరాఫీలు, ఏనుగులు, తోడేళ్ళు, గ్రద్దల గురించి ఆలోచించవచ్చు … ఇంకా, దాదాపు అన్ని సందర్భాల్లో, వారు ఎదిగిన జంతువుల గురించి ఆలోచిస్తారు. చేప పిల్లలు లేదా అప్పుడే గుడ్ల నుంచి బయటికి వచ్చిన అకశేరుకాలు(వెన్నెముక లేని జీవులు) గురించి చాలా అరుదుగా ఆలోచిస్తారు. అయితే ప్రకృతిలో ఎక్కువగా వున్నవి ఇవే. చాలా జంతువులు పరిమాణంలోనూ, వయస్సులో కూడా చాలా చిన్నవి. అడవి జంతువుల గురించి చాలా మందికి వున్న ఊహ వాస్తవంగా వాటి పరిస్థితులకు పూర్తిగా ప్రాతినిధ్యం వహించదు, అడవి జంతువుల జీవితం ప్రకృతిలో ఎలా వుంతుంది అని వారు అనుకుంటారో దాని ఆధారంగా ఊహిస్తారు.

చివరగా, అడవిలో నివసించే జంతువులకు మనం సహాయం చేయకూడదని భావించే వ్యక్తులు కూడా ఉన్నారు ఎందుకంటే అలా చేయడం సహజమైనది కాదు అని వారు భావిస్తారు. ఏదేమైనా, అడవి జంతువులలా మానవులు ఇబ్బందిపడుతున్నప్పుడు, మనం వారికి సహాయపడటాన్ని అంగీకరిస్తాము. జంతువుల విషయంలో ఎందుకు భిన్నమైన వైఖరి ఉంటుంది? ఇది అడవి జంతువుల పట్ల ఒక రకమైన వివక్షలా కనిపిస్తుంది. జంతువులు ఆ పరిస్థితుల వల్ల కలిగే ఇబ్బంది నుండి విముక్తి పొందాలని కోరుకుంటాయి, కాబట్టి ఆ హానికరమైన పరిస్థితులకు మనుషులు కారణం అయినా కాకపోయినా మనం వాటికి సహాయం చేయాలి. వాస్తవానికి, మానవులు ఇప్పటికే మానవ ప్రయోజనాల కోసం ప్రకృతిలో జోక్యం చేసుకుంటున్నారని మనం గమనించాలి. మనం ఇళ్ళు, ఆసుపత్రులు, పాఠశాలలు, గ్రంథాలయాలను నిర్మిస్తాము … మనం తినడానికి అవసరమైన ఆహారాన్ని కూడా పందిస్తము. మన అవసరాల కోసం మన పరిసరాలను మార్చడానికి మనం సిద్ధంగా ఉంటే, అడవి జంతువుల వంటి ఇతర, భావాలు గల జీవులకు సహాయం అవసరమైనప్పుడు చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి.

జంతువులకు ఉత్తమంగా ఎలా సహాయపడాలనే దాని గురించి మరింత నేర్చుకోవడం

జంతువులకు ఉత్తమంగా ఎలా సహాయం చేయాలో తెలుసుకోవడానికి దానిని జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, పరిశోధనలో పెట్టుబడులు పెట్టడం చాలా ముఖ్యం, అది జంతువులకు సహాయపడే ప్రతికూల పరోక్ష పరిణామాలను నివారించడానికి మనకు సహాయపడుతుంది. శుభవార్త ఏమిటంటే, ఈ ప్రయోజనం కోసం ఉపయోగపడే చాలా సమాచారం ఇప్పటికే సిద్దంగా వుంది. పశువైద్య శాస్త్రవేత్తలు పెంపుడు జంతువుల శ్రేయస్సును అంచనా వేయడంపై దృష్టి పెట్టారు, కానీ వారు అడవి జంతువుల గురించి కూడా పరిశీలించారు. పర్యావరణ శాస్త్రవేత్తలు ఈ జంతువుల జనాభాను, వాటి జీవిత చరిత్రలు మరియు ఇతర జంతువులతో ఇంకా వాటి పరిసరాలతో అవి సంభాషించే విధానం గురించి పరిశోధించారు. ఇవన్నీ జంతువులకు సహాయపడే కార్యక్రమాలను రూపొందించడానికి దృఢమైన పునాదిని అందించగలవు.

దురదృష్టవశాత్తు, ఈ విభిన్న ప్రాంతాల నుండి జ్ఞానం అరుదుగా ఒక దగ్గరకి చేర్చబడుతుంది. చాల శాస్త్రీయ పరిశోధనలలో మానవేతర జంతువులను వ్యక్తిగతంగా పరిగణలోకి తీసుకోవడం లేదని కూడా మనం గుర్తుంచుకోవాలి. పరిశోధనలో క్రాస్-డిసిప్లినరీ ఫీల్డ్ సృష్టించబడాలని వాదించడానికి కారణం ఇదే. అడవిలోని జంతువులకు సహాయం చేయడానికి ఉపయోగపడే మరింత జ్ఞానాన్ని సేకరించడానికి ఈ కొత్త విభాగం మనకి అవకాసమిస్తుంది.

ప్రస్తుతం, ఈ సమస్యపై పరిశోధన, జంతువులకు సహాయం చేయడానికి మరియు ఇప్పటికే ఉన్న మార్గాలను పరిశీలించడానికి, కొత్త మార్గాలను అభివృద్ధి చేయడానికి మనకు వీలు కల్పిస్తుంది. ప్రస్తుత పద్దతుల్లో కొన్ని మిగతా వాటి కంటే ప్రభావవంతంగా ఉండచ్చు, అంటే ఈ పద్ధతుల్లో కొన్ని మిగతా వాటి కంటే జంతువులకు మనం ఎక్కువగా సహాయపడేలా చేయవచ్చు. మరింత ప్రభావవంతమైన పద్ధతులను ఎంచుకోవడానికి పరిశోధన మనకు సహాయపడుతుంది, అలాగే ఈ సమస్య ఎంత ముఖ్యమో ఇతరులు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

మరింత జ్ఞానాన్ని సేకరించడం భవిష్యత్తులో జంతువులకు సహాయపడే కొత్త మార్గాలను అభివృద్ధి చేయడంలో మనకి ఉపయోగపడుతుంది. అలాగే, వివిధ పరిస్థితులలో పర్యావరణ వ్యవస్థ స్థాయిలో జంతువుల శ్రేయస్సు ఎలా ప్రభావితమవుతుందనే దాని గురించి ఇంకా అడవిలో అధ్వాన్నమైన పరిస్థితుల నుండి మంచి పరిస్థితులకు పరివర్తన సాధించడానికి ఉత్తమ మార్గాల గురించి మనం మరింత తెలుసుకోగలుగుతాం. ఈ కారణంగా, అడవిలో జంతువుల పట్ల శ్రద్ధ వహించే వైఖరి ప్రస్తుతం నివసిస్తున్న జంతువులపై మాత్రమే కాకుండా భవిష్యత్తులో నివశించబోయే జంతువుల పట్ల కూడా ప్రభావాన్ని చూపుతుంది. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే జంతువులకు ఏమి జరుగుతుందనే దాని గురించి మనం నిజంగా శ్రద్ధ వహిస్తే, మనం ప్రస్తుతం జీవిస్తున్న వాటి గురించి మాత్రమే ఆందోళన చెందడం కాదు. భవిష్యత్తులో జీవించే జంతువులు ఎంతగానో ఇబ్బందిపడే అవకాశం ఉంది, కాబట్టి భవిష్యత్తు వాటికి ఉత్తమమైనదిగా ఉండేలా చేయడం మనందరికీ మొదటి ప్రాధాన్యతగా ఉండాలి.


తరువాత చదవవలసినవి

Animal Ethics (2020) Introduction to wild animal suffering: A guide to the issues, Oakland: Animal Ethics [accessed on 3 April 2020].

Dorado, D. (2015) “Ethical interventions in the wild: An annotated bibliography”, Relations: Beyond Anthropocentrism, 3, pp. 219-238 [accessed on 23 November 2019].

Faria, C. (2013) “Differential obligations towards others in need”, Astrolabio, 15, pp. 242-246 [accessed on 14 October 2019]

Faria, C. (2018) “The lions and the zebras: Towards a new ethics of environmental management in African National Parks”, in Ebert, R. & Roba, A. (eds.) Africa and her animals: Philosophical and practical perspectives, Pretoria: Unisa, pp. 325-342.

Faria, C. & Paez, E. (2015) “Animals in need: The problem of wild animal suffering and intervention in nature”, Relations: Beyond Anthropocentrism, 3, pp. 7-13 [accessed on 30 September 2019].

Faria, C. & Horta, O. (2019) “Welfare biology”, in Fischer, B. (ed.) Routledge handbook of animal ethics, London: Routledge, 455-466.

Garmendia, G. & Woodhall, A. (eds.) (2016) Intervention or protest: Acting for nonhuman animals, Wilmington: Vernon.

Hadley, J. (2006) “The duty to aid nonhuman animals in dire need”, Journal of Applied Philosophy, 23, pp. 445-451.

Horta, O. (2010a) “Debunking the idyllic view of natural processes: Population dynamics and suffering in the wild”, Télos, 17 (1), pp. 73-88 [accessed on 28 September 2019].

Horta, O. (2010b) “The ethics of the ecology of fear against the nonspeciesist paradigm: A shift in the aims of intervention in nature”, Between the Species, 13 (10), pp. 163-187 [accessed on 4 November 2019].

Horta, O. (2013) “Zoopolis, intervention, and the state or nature”, Law, Ethics and Philosophy, 1, pp. 113-125 [accessed on 18 September 2019].

Horta, O. (2017a) “Animal suffering in nature: The case for intervention”, Environmental Ethics, 39, pp. 261-279.

Horta, O. (2017b) “Population dynamics meets animal ethics”, in Garmendia, G. & Woodhall, A. (eds.) Ethical and political approaches to nonhuman animal issues: Towards an undivided future, Basingstoke: Palgrave Macmillan, pp. 365-389.

Johannsen, K. (2017) “Animal rights and the problem of r-strategists”, Ethical Theory and Moral Practice, 20, pp. 333-345.

Mannino, A. (2015) “Humanitarian intervention in nature: Crucial questions and probable answers”, Relations: Beyond Anthropocentrism, 3, pp. 109-120 [accessed on 30 October 2019].

Moen, O. M. (2016) “The ethics of wild animal suffering”, Etikk i Praksis – Nordic Journal of Applied Ethics, 10 (1), pp. 91-104 [accessed on 2 December 2019].

Musschenga, A. W. (2002) “Naturalness: Beyond animal welfare”, Journal of Agricultural and Environmental Ethics, 15, pp. 171-186.

Næss, A. (1991) “Should we try to relieve clear cases of extreme suffering in nature?”, Pan Ecology, 6 (1), 1-5.

Ng, Y.-K. (1995) “Towards welfare biology: Evolutionary economics of animal consciousness and suffering”, Biology and Philosophy, 10, pp. 255-285.

Nussbaum, M. C. (2006) Frontiers of justice: Disability, nationality, species membership, Cambridge: Harvard University Press.

Palmer, C. (2013) “What (if anything) do we owe wild animals?”, Between the Species, 16, pp. 15-38 [accessed on 23 September 2019].

Pearce, D. (2015a [1995]) The hedonistic imperative, Seattle: Amazon Digital Services.

Pearce, D. (2015b) “A welfare state for elephants? A case study of compassionate stewardship”, Relations: Beyond Anthropocentrism, 3, pp. 153-164 [accessed on 22 November 2019].

Ryf, P. (2016) Environmental ethics: The case of wild animals, Basel: University of Basel.

Soryl, A. A. (2019) Establishing the moral significance of wild animal welfare and considering practical methods of intervention, Master’s thesis, Amsterdam: University of Amsterdam.

Sözmen, B. İ. (2013) “Harm in the wild: Facing non-human suffering in nature”, Ethical Theory and Moral Practice, 16, pp. 1075-1088.

Tomasik, B. (2015 [2009]) “The importance of wild animal suffering”, Relations: Beyond Anthropocentrism, 3, pp. 133-152 [accessed on 3 December 2019].

Torres, M. (2015) “The case for intervention in nature on behalf of animals: A critical review of the main arguments against intervention”, Relations: Beyond Anthropocentrism, 3, pp. 33-49 [accessed on 14 October 2019].

Vinding, M. (2014) A Copernican revolution in ethics, Los Gatos: Smashwords [accessed on 28 July 2019].

Vinding, M. (2016) “The speciesism of leaving nature alone, and the theoretical case for wildlife anti-natalism”, Apeiron, 8, pp. 169-183 [accessed on 28 October 2019].